భక్తి కాదు..ఉన్మాదం..తలపై టెంకాయిలు కొట్టించుకున్నారు

Update: 2019-08-15 06:30 GMT
పిచ్చ పది రకాలని ఊరికే అనలేదేమో? నమ్మకాలకు మూడత్వం అనే పిచ్చ తోడైతే పరిస్థితి ఎంత గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుందో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. భక్తి పేరుతో మూఢాచారాల్ని సాగిస్తున్న తీరు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అమ్మవారి పండగ పేరుతో తమిళనాడులో జరిగే ఒక ఆచారం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే.

చేతులు కమిలిపోయేలా కొరాడాతో దెబ్బలు కొట్టించుకోవటం.. తలకు గాయమై.. రక్తం కారేలా టెంకాయిలు కొట్టించుకునే ఈ తీరు చూస్తే.. ఇదంతా భక్తి కాదు ఉన్మాదం అనుకోకుండా ఉండలేం. తమిళనాడులోని కులితలాయ్ కు సమీపంలోని మెట్టు మహాదానపురంలో కురుంబా గిరిజన పండుగను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తుంటారు.

అమ్మవారి పండుగ పేరుతో నిర్వహించే ఉత్సవంలో వింత ఆచారాన్ని అనుసరిస్తుంటారు. ఇందులో భాగంగా చేతులపై కొరడాతో కొట్టేస్తుంటారు. తలలపై ఆలయ పూజారి టెంకాయిలు పగలగొట్టించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులకు రక్తం కారేలా దెబ్బలు తగిలాయి.

ఈ వింత ఆచారం కారణంగా గాయాల బారిన పడిన వారికి వైద్య సాయం అందించేందుకు వీలుగా వైద్యుల్ని.. అంబులెన్స్ లను ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోలేదట. ఎందుకంటే.. గాయాలయ్యాక వైద్యం చేయించుకుంటే అమ్మవారికి కోపం వస్తుందన్న ఉద్దేశంతో గాయాల మీద పసుపు.. విబూది రాసుకొని పూజలు చేసినవైనం తెలిస్తే డిజిటల్ యుగంలోనూ ఇలానా? అని షాక్ తినక మానరు. కావాలంటే.. ఈ వీడియోనే ఇందుకు సాక్ష్యం.


Full View

Tags:    

Similar News