సంచలనం సృష్టిస్తున్న బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం జరిగిందా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెటిల్ మెంట్ కోసం రాత్రివేళ కుకునూరుపల్లి ఎస్ ఐ ఇంటికి రాజీవ్.. శ్రవణ్ లతో కలిసి వెళ్లిన శిరీషపై ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి లైంగిక దాడికి యత్నించినట్లుగా పోలీసులు ఇప్పటికే వెల్లడించటం తెలిసిందే.
అయితే.. మృతి నేపథ్యంలో ఆమె లో దుస్తులపై ఉన్న మరకల్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తే.. ఆమెపై అత్యాచారం జరిగింది.. లేనిది తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎఫ్ ఎస్ ఎల్ ప్రాథమిక నివేదిక వచ్చింది. దీని ప్రకారం శిరీషపై అత్యాచారం జరగలేదని పేర్కొంది.
ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు అందినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ పూర్తిస్థాయిలో వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది అధికారికంగా తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
శిరీషది ముమ్మాటికి ఆత్మహత్యేనని పోలీసులు స్పష్టం చేస్తుంటే.. ఆమెది హత్య అని శిరీష బంధవులు ఆరోపిస్తున్నారు. శిరీష మరణానికి కారకులుగా భావిస్తున్న నిందితులు రాజీవ్.. శ్రవణ్ లు ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విచారణ కోసం రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బుధవారం వారిని కోర్టుకు హాజరుపరిచి.. జైలుకు పంపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం శిరీషపై అత్యాచారం జరగలేదన్న నివేదిక రావటంతో.. ఇప్పుడున్న సందేహాలు పూర్తిస్థాయిలో తీరాలంటే.. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని చెప్పకతప్పదు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/