మోదీకి మతి పోయిందన్న కాంగ్రెస్ సీనియర్

Update: 2017-11-29 16:49 GMT
గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు తమ స్పీడు పెంచారు. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా మోదీ అతి చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. అంతేకాదు...  ప్ర‌ధాని మోదీ మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఆయన అన్నారు. ఆయ‌న‌ తీరు చాలా నెగెటివ్‌గా ఉంద‌ని మండిప‌డ్డారు.

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళమైపోయిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ జీడీపీ 2.5 శాతం ప‌డిపోయింద‌ని, దీని వ‌ల్ల దేశం.. పూర్తిగా అత‌లాకుతలం అయింద‌ని ఆనంద్ శ‌ర్మ అన్నారు.  ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామ‌న్న మోడీ ఒకే దెబ్బ‌తో 3.5 కోట్ల మందికి ఉద్యోగాలు లేకుండా చేశార‌ని ఆనంద్ శ‌ర్మ విమ‌ర్శించారు. మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు ప్ర‌ధాని ఇచ్చిన‌ హామీల‌ను మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

మరోవైపు ఇవాంకా ట్రంప్ విష‌యంలో ప్ర‌ధాని తన స్థాయికి దిగజార్చుకున్నారని ఆనంద్ శర్మ అన్నారు.  గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూయర్ స‌ద‌స్సు కు హాజ‌రైన ఇవాంక‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తి ఇవాంకాకు అంత ప్రాధాన్యం ఇవ్వడమేంటన్నారు. ముఖ్య‌మంత్రి గానీ లేక‌పోతే క్యాబినెట్ మంత్రితో గాని స్వాగ‌త స‌త్కారాలు చేస్తే స‌రిపోయేద‌ని ఆనంద్ శ‌ర్మ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాని త‌న స్థాయిని తానే త‌గ్గించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. మోడీ….తాను ప్ర‌ధాని అన్న సంగ‌తి మ‌రిచిపోకూడ‌ద‌ని ఆనంద్ శ‌ర్మ హిత‌వు పలికారు.
Tags:    

Similar News