ఆ దేశపు రోడ్ల‌పై ప్ర‌ధాని మోదీ ప్లెక్సీ.. కార‌ణం ఇదే!

Update: 2021-03-11 15:33 GMT
''అంద‌రూ బాగుండాలి.. అందులో మ‌నం ఉండాలి'' అనే తత్వం భారతీయ విధానం. తరాల చరిత్ర తిరగేసినా.. కనిపించే పద్ధతి ఇదే. నాడు స్వాతంత్రం సిద్ధించిన త‌ర్వాత ప్ర‌ధానిగా నెహ్రూ చేప‌ట్టిన‌ అలీన విధానం ఎన్నో దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచింది. అందరితో మైత్రి కొన‌సాగిస్తూ.. మ‌నం ఎలా ఎద‌గాలో చూపించిందా ప‌ద్ధ‌తి. ఆ మూలాల‌తోనే కొన‌సాగుతున్న భార‌త సంస్కృతి.. ఇప్ప‌టి వ‌ర‌కూ పొరుగు వారిని ప్రేమ‌గానే చూస్తూ వ‌చ్చింది. క‌ష్ట‌కాలంలో ఆప‌న్నుల‌కు చేయి అందిస్తూనే ఉంది.

తాజాగా.. క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌యంలోనూ విదేశాల‌కు అండ‌గా నిలిచింది భార‌త్‌. దేశీయంగా టీకాల‌ను అభివృద్ది చేసిన భార‌త్‌.. మ‌న అవ‌స‌రాలు మాత్ర‌మే చూసుకోకుండా.. విదేశాల‌కు కూడా స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు ఉచితంగా అందించ‌గా.. కొద్దిమేర త‌క్కువ ధ‌ర‌ల‌కే ఎక్స్ పోర్ట్ చేస్తోంది.

ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు కొవిడ్ వ్యాక్సిన్ ను స‌ర‌ఫ‌రా చేసింది భార‌త్‌. తాజాగా.. గ‌త వారం కెన‌డాకు కూడా ఐదు ల‌క్ష‌ల డోసుల‌ను పంపించింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌జ‌ల‌కు త‌మ కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలిపారు కెన‌డా వాసులు. ఇందులో భాగంగా.. కెనడాలోని టోరంటో రోడ్ల‌పై ‘థాంక్యూ ఇండియా.. పీఎం నరేంద్ర మోదీ' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారత్ సహాయంపై ఐక్యరాజ్య సమితి కూడా అభినందనలు తెలిపింది.
Tags:    

Similar News