గ్రేటర్ ఎన్నికలకు.. మోడీ ప్రోగ్రాంకు మరోసారి క్లాష్ అయ్యిందిగా?

Update: 2020-11-30 17:30 GMT
తాజాగా డిసైడ్ చేసిన ఒక ప్రోగ్రాం గురించి తెలిసినంతనే మీ మనసులోకి ఒక సందేహం రావటం ఖాయం. రెండు రోజుల క్రితం (శనివారం) ప్రధాని మోడీ హైదరాబాద్ కు రావటం.. కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు అని చెబుతున్నా.. ఇదంతా తమ సారు బహిరంగ సభను చిన్నది చేసి చెప్పటానికే ఇదంతా చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ నేతలు పలువురు ఇదే విషయాన్ని పలు వేదికల మీద ప్రస్తావించారు. ఈ విషయాన్ని మర్చిపోకముందే.. తాజాగా ప్రధాని మోడీ కార్యాలయం ఒక ప్రోగ్రాంను ఫిక్స్ చేశారు. డిసెంబరు నాలుగున నిర్వహించే ఈ కార్యక్రమం గురించి విన్నంతనే టీఆర్ఎస్ నేతలు ముఖం చిట్లించటమే కాదు.. బీజేపీపై ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉందంటున్నారు.

అదే రోజు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ ను నిర్వహించటం కారణంగా.. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఆలస్యంగా సాగే వీలుంది. ఓట్ల లెక్కింపు ఉదయమే మొదలైనా.. అధికారికంగా గెలుపు ప్రకటన చేయటానికి తక్కువలో తక్కువ సాయంత్రం మాత్రమే వీలుందంటున్నారు. ఎందుకంటే.. ఓట్లు మొత్తాన్ని కౌంట్ చేసి కట్టలు కట్టటం.. ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావటానికి కనీసం సాయంత్రం నుంచి రాత్రి వరకు పడుతుందంటున్నారు.

గ్రేటర్ ఫలితాల మీద అవగాహన వచ్చేసరికే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకుపట్టే వీలుంది. మరోవైపు ప్రధాని మోడీ లాంటి అధినేత.. కోవిడ్ మీద పరిశోధనల మీద స్వయంగా రివ్యూ చేస్తుంటే.. మీడియాలో దానికి ఇచ్చే ప్రాధాన్యత భారీగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్ ఎన్నికలకు ప్రచారం లభించినా.. మోడీ ప్రోగ్రాంతో దాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమైతే.. దాని హడావుడి టీవీల్లో పెద్దగా కనిపించే అవకాశం తక్కువ ఉందంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పనిసరి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే.. దాని ప్రభావం పడకుండా ఉండేందుకు వీలుగా ప్రధాని మోడీ రివ్యూ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. నిజానికి.. కేసీఆర్ సభ రోజు హైదరాబాద్ కార్యక్రమం.. కీలకమైన పోలింగ్ ఫలితాలు విడదల వేళలోనే అఖిలపక్షంతో జరిగే ప్రధాని మీటింగ్ కే అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఈ అంశం ఒక్కటి చాలు టీఆర్ఎస్ నేతలు చెలరేగిపోతున్నారని చెబుతున్నారు. మనలో మన మాట ఇంతకీ అనుకోని రీతిలో డేట్స్ క్లాష్ అవుతున్నాయా? వేరే ఏదైనా కారణం ఉందా మోడీ సాబ్?
Tags:    

Similar News