మోడీ ఏలుబ‌డిలో 'ధ‌ర‌ల' భార‌తం!

Update: 2022-10-14 04:01 GMT
అదేంటి.. అనుకుంటున్నారా?   ఔను ఇది నిజ‌మే! ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏలుబ‌డిలో.. భార‌త దేశం.. ధ‌ర‌ల భార‌తంగా మారిపోయింద‌ని.. ప‌లు సర్వేలు చెబుతున్నాయి. 8 ఏళ్లుగా.. ప్ర‌ధాని మోడీ ఉన్నారు. ఈయ‌న హ‌యాంలో పెరిగినంత‌గా.. ధ‌ర‌లు ఏ ఇత‌ర ప్ర‌భుత్వాల ఏలుబ‌డిలోనూ.. పెర‌గ‌లేద ని..స‌ర్వేలో ప్ర‌జ‌లు మొత్తుకుంటున్నారు. దీనికి కార‌ణం.. విస్త‌రించిన జీఎస్టీ.. పాపం.. త‌మ‌ క‌డుపు కొడుతోంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.

సాధార‌ణంగా.. ధ‌ర‌ల పెంపు అనేది.. నిత్యావ‌స‌రాల‌కు మిన‌హాయింపును ఇస్తుంది. ఏదో బ‌డ్జెట్ స‌మ‌యం లో మాత్ర‌మే..ధ‌ర‌ల‌ను పెంచుతూ.. లేదా..త‌గ్గిస్తూ.. నిర్ణ‌యాలు తీసుకుంటారు. దీనిపై ఏదైనా వ్య‌తిరేక‌త వ‌స్తే.. వెన‌క్కి త‌గ్గుతారు. అయితే.. మోడీ ఏలుబ‌డిలో.. పెంపే త‌ప్ప‌.. త‌గ్గింపు అన్న‌ది లేకుండా పోయింద‌నేది.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు చేస్తున్న‌వాద‌న‌.

దేశంలో 22 శాతం మంది పేద‌లు ఉన్నారు. 74 శాతం మంది.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జలు ఉన్నార‌నేది.. గ‌ణాంకాలు చెబుతున్న లెక్క‌. ఇక‌, మిగిలిన 4 శాత‌మే ఉన్న‌త‌స్థాయి. వీరిలో సెల‌బ్రిటీలు.. పారిశ్రామిక వేత్త‌లు.. ఇలా ఉన్న‌త శ్రేణి వ‌ర్గాలు ఉన్నాయి. కానీ, ధ‌ర‌ల పెంపు మాత్రం ఈ 8 ఏళ్ల కాలంలో 300 శాతం పెరిగింది. ఇది మ‌ధ్య త‌ర‌గ‌తి.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు.. ప్రాణ‌సంక‌టంగా మారిపోయింద‌నేది వాస్త‌వం.

వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై స‌బ్సిడీని ఒకింత బాగున్న‌వారు..వ‌దులుకోవాల‌ని కొన్నాళ్లు ప్ర‌చారం చేసిన‌.. మోడీ ప్ర‌భుత్వం.. త‌ర్వాత‌.. దాన్ని త‌నంత‌ట తానే అమ‌లు చేసింది. అంటే.. గ్యాస్‌కు సంబంధించిన స‌బ్సిడీని ఒక‌ప్పుడు..బ్యాంకుల్లో వేసేవారు.  కానీ,నేడు మానేశారు. గ‌త రెండు నెల‌లుగా.. స‌బ్సిడీని ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయారు. మ‌రోవైపు.. గ్యాస్ ధ‌ర‌లు పెంచేశారు. 8 ఏళ్ల కింద‌ట 450 గా ఉన్న సిలిండ‌ర్ ధ‌ర‌.. ప్ర‌స్తుతం 1080 రూపాయ‌ల‌కు చేరింది.

ఇది.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి న‌డ్డి విరిచింది. ఇక‌, పెట్రోల్ ధ‌ర‌ల‌ను విడ‌త‌ల వారీ గా పెంచుతూ.. 8 ఏళ్ల‌లో 78 రూపాయ‌ల నుంచి 112కు పెంచారు. ఇదిలావుంటే.. కీల‌క‌మైన బియ్యం, ప‌ప్పులు.. పాలు, పెరుగు, పంచ‌దార‌.. మ‌సాలా దినుసులు... చెప్పులు.. ఇలా ఒక్క‌టేమిటి.. నిత్య జీవితంలో అవ‌స‌ర‌మైన ప్ర‌తిదీ  పెంచుకుంటూ పోయారు. ఫ‌లితంగా.. నేడు.. దేశంలో ఆర్థిక ప‌రిస్థితి.. దారుణంగా త‌యారైంద‌నేది.. స‌ర్వేలు చెబుతున్న వాస్త‌వం.

మ‌రోవైపు గృహ‌రుణాల వ‌డ్డీలు పెంపు ద్వారా.. మ‌ధ్య‌త‌ర‌గతిపై మోయ‌లేని భారం మోపార‌నేది వాస్త‌వం. ఇవ‌న్నీ.. కూడా.. దేశాన్ని ధ‌ర‌ల భార‌తంగా మార్చేశాయ‌నేది ప్ర‌జ‌ల ఆవేద‌న‌. ఒక‌ప్పుడు పుట్టిన రోజు, పెళ్లిరోజుల‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించుకునే కుటుంబాలు.. నేడు. వాటిని త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో పండుగల కోసం వేచి చూసిన కుటుంబాలు.. ఇప్పుడు పండుగ‌లు వ‌స్తే.. బెంబేలెత్తుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదీ.. మోడీ భార‌తం..!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News