కరోనా పై పోరుకు ప్రధాని తల్లి విరాళం ..ఎంతంటే

Update: 2020-04-01 06:00 GMT
క‌రోనా మహ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌తోపాటు దేశ ప్ర‌జ‌ల‌ను కూడా ఉక్కిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిరుపేద‌లు తిండి లేక తిప్ప‌లు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. దీనితో దేశంలో  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌ కు భారీ విరాళాలు అందుతున్నాయి.

అయితే ఓ పక్క ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు భారీగా విరాళాలు అందిస్తుంటే, మరో పక్క సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మాతృమూర్తి హీరాబెన్ కూడా పీఎం కేర్స్‌ కు త‌న‌వంతు సాయం అందించారు. తాను ఎన్నో ఏండ్లుగా పొదుపు చేసుకుంటున్న సొమ్ములో నుంచి రూ.25,000ల‌ను పీఎం కేర్స్ విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తల్లిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇకపోతే 98 ఏళ్ల  హీరాబెన్ చిన్న కుమారుడు పంకజ్ మోడీతో కలిసి గుజరాత్ లోని గాంధీ నగర్ సమీపంలో నివసిస్తున్నారు.
Tags:    

Similar News