ప్రిన్స్ హ్యారీని ట్రాప్ చేశారా? డబ్బులు ఇవ్వటం మానేశారా?

Update: 2021-03-08 15:30 GMT
సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ఇంతకాలం ప్రైవేటుగా ఉన్న అంశాలు ఇప్పుడు పబ్లిక్ అయ్యాయి. రాజరికం గోడల్లో దాడిన పలు రహస్యాలు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ ఓపెన్ అయ్యారు. ఆ మాటకు వస్తే.. బరస్ట్ అయ్యారని చెబితే బాగుంటుందేమో.  భార్య మేఘన్ తో కలిసి ఓఫ్రా విన్ఫ్రే కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాన్ని వెల్లడించారు. విన్నంతనే జీర్ణించుకోలేని కొత్త విషయాలు ఆయన నోటి నుంచి వచ్చాయి.

ఆయన మాటల్లోనే చెబితే..

-  మేఘన్ కోసమే రాజకుటుంబం నుంచి బయటకు వచ్చినట్లుగా భావిస్తారు. కానీ.. అది నిజం కాదు. నన్ను ట్రాప్ చేశారు. ఆ మాటకు వస్తే.. నన్నే కాదు.. నా సోదరుడ్ని.. తండ్రిని కూడా ట్రాప్ చేశారు.

-  రాచరిక విధుల నుంచి వెనక్కి తగ్గుతున్నామని ప్రకటించిన తర్వాత రాజకుటుంబం నుంచి డబ్బులు రావటం ఆగిపోయాయి. ఆసమయంలో నా తల్లి (ప్రిన్సెస్ డయానా) నా కోసం వదిలి వెళ్లిన డబ్బులే నాకు మిగిలాయి. వాటితోనే కుటుంబానికి భద్రత ఇవ్వగలిగా.

-  నా తండ్రితోనూ.. సోదరుడితోనూ సంబంధాలు అంతంత మాత్రమే. పెళ్లి తర్వాత కుటుంబంలో చాలానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేనెప్పుడు నా కొడుక్కి రాజకుటుంబంలో రాజరిక హోదా రావాలని కోరుకోలేదు. దాని గురించి ఎవరితోనే చర్చించలేదు.

-  నా తల్లి జీవితంలో జరిగినట్లే నా జీవితంలోనూ జరుగుతుందని భయపడ్డా. నిస్సహాయ స్థితిలోనే రాజకుటుంబం నుంచి విడిపోదామని అనుకున్నా. ఆ ప్రకటన తర్వాత నాన్న నాతో మాట్లాడటం మానేశారు. నన్ను నమ్ముకొని వచ్చిన భార్య.. కొడుకు కోసమే బయటకు వచ్చేశా.

-  మీకో శుభవార్త చెప్పాలనుకుంటున్నాం. త్వరలో మాకు ఆడపిల్ల పుట్టబోతుంది. ఈ వేసవిలో మా అమ్మాయికి జన్మనివ్వబోతున్నాం.
Tags:    

Similar News