మరో సంచలన విషయం బయటకు వచ్చింది. రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన ఒక సంచలన విషయం తాజాగా బయటకు వచ్చింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ తో వివాహం జరిగినా అతడి ప్రేమ కరవు కావటం.. వేరే మహిళతో సంబంధాలు ఉండటాన్ని డయానా భరించలేకపోయింది. ప్రేమ రాహిత్య జీవితాన్ని గడపలేకపోయిన ఆమె.. తన అంగరక్షకునితో లేచిపోవాలనుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యంగా చెబుతున్న టేపులు బయటకు రానున్నట్లు చెబుతున్నారు.
డయానా స్వరాన్ని పరీక్షించే సమయంలో ఆమె మాటల్ని రికార్డు చేశారు. ఈ సమయంలో ఆమె చెప్పిన కొన్ని వ్యక్తిగత అంశాలు కొన్ని రికార్డు అయ్యాయి. 1991లో ఛార్లెస్ తో విడిపోయిన అనంతరం తన భావాల్ని ప్రజలకు చెప్పేందుకు వీలుగా సాయం చేయటం కోసం పీటర్ సెట్టెలన్ ను నియమించుకున్నారు.
తన సెక్యూరిటీ గార్డు బారీ మన్నాకీతో ఉన్న ప్రేమ వ్యవహరాన్ని.. ప్రిన్స్ ఛార్లెస్ కు.. కెమిల్లాపార్కర్ తో ఉన్న సంబంధాలు ఈ టేపులో ఉన్నట్లుగా చెబుతున్నారు. వీటిని త్వరలోనే చానల్ 4 ప్రసారం చేయనుంది. టేపుల్లో ఉన్న వివరాలకు సంబంధించి చూస్తే.. తాను 24.. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఉన్న వాతావరణంలో పని చేసే ఒక వ్యక్తి ప్రేమలో పూర్తిగా పడిపోయినట్లుగా పేర్కొన్నారు. తాను సంతోషంగా తనకున్నవన్నీ విడిచిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా డయానా పేర్కొన్నారు.
నేను బాగున్నానని చెప్పే మనిషి ఒకరు నాకు కావాలి.. అతను నాకు మానసికంగా ధైర్యం చెప్పి బయటకు వెళ్లమనేవాడని పేర్కొన్నారు. తాను రాజప్రసాదంలో కేకలు వేసేదానినని.. తాను నిప్పుతో చెలగాటమాడలేదని.. చేతులు కాల్చుకోలేదన్నట్లుగా ఒక మీడియా సంస్థ పేర్కొంది. తన సెక్యూరిటీ గార్డుతో తనకున్న సంబంధం శారీరకమైనది కాదని ఆమె స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
"ఆయన్ను బయటకు పంపేశారు. తర్వాత మైటారు బైకు ప్రమాదంలో చనిపోయాడు. అది నా జీవితంలో పెద్ద దెబ్బ" అని డయానా పేర్కొన్నట్లుగా ఉందని పేర్కొనటం గమనార్హం. ఇదే టేపుల్లో తన భర్తకు వేరే మహిళలతో ఉన్న సంబంధాల గురించి డయానా తన భర్తను నిలదీసిన అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. వేల్స్ రాకుమారుల్లో మహిళలతో సంబంధాలు పెట్టుకున్న వారు తానొక్కడినే అంటే తాను ఒప్పుకోనని చెప్పినట్లుగా టేపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్తకు వేరే మహిళలతో ఉన్న సంబంధాల గురించి బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు డయానా చెప్పినప్పుడు ఆమె నిస్సహాయత వ్యక్తం చేసినట్లుగా టేపుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టేపులు ప్రసారం కాకుండా ఉంటే మంచిదన్న భావనను డయానా సోదరుడు పేర్కొంటున్నారు. సంచలనాలకు సిద్ధమైన కొన్నిఛానళ్లు ఇలాంటి వినతుల్ని విని వెనక్కి తగ్గుతాయా?