ఇప్పటి రోజుల్లో మీడియా ఎంత దూకుడుగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన వార్తలకు ఇస్తున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మామూలు అంశాలకే చెలరేగిపోతున్న మీడియా.. ఏ మాత్రం స్పైసీగా ఉన్న ఇష్యూ జరిగినా వదిలిపెట్టటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద తెలుగు మీడియా ఎంతగా చెలరేగిపోవాలి? ఎన్నేసి వార్తలు ఇవ్వాలి? ఏపీకి ఎంత నష్టం జరుగుతుందన్న విషయం మీద వార్తలు రాయాలి?
అదేం చిత్రమో మిగిలిన అంశాల మీద విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే కొన్ని మీడియా సంస్థలు.. ప్రత్యేక హోదా అంశం మీద ఆచితూచి రియాక్ట్ కావటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటన మీద ప్రింట్ మీడియాతో పోలిస్తే.. టీవీ ఛానళ్లు చెలరేగిపోయాయి అని చెప్పాలి. ఒక ఛానల్ కు మించి మరో ఛానల్ ప్రత్యేక చర్చా కార్యక్రమాల నుంచి.. నేతల స్పందనకు పెద్దపీట వేశాయి. దీనికి భిన్నంగా ఈ ఇష్యూ మీద ప్రింట్ మీడియా జోరు తక్కుగా ఉందని చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకునే ఒక ప్రధాన పత్రిక మాత్రం ప్రత్యేక హోదా మీద కేంద్రమంత్రిగారి తాజా వ్యాఖ్యను లోపలి పేజీల్లో వేసేశారు. ప్రాధాన్యతలు నిర్ణయించే విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో? అన్న సందేహం శనివారం సదరు పేపర్ ను చూసిన చాలామందికి కలగకమానదు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాన్ని లోపల పేజీల్లో.. కింద భాగంలో అచ్చేశామంటే.. అచ్చేశామన్నట్లుగా వేయటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తొలిరోజు జరిగింది పొరపాటుగా అనుకుంటే.. శనివారం జనసేన అధినేత ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కేంద్రానికి దాదాపుగా వార్నింగ్ ఇచ్చిన తీరులో తన వాదనను ట్వీట్స్ రూపంలో వినిపించారు. ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేయొద్దని చెప్పటమే కాదు.. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పును గుర్తుచేస్తూ.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దన్న మాటను తన ట్వీట్ తో చెప్పేశారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి ప్రత్యేక హోదా మీద గళం విప్పటం.. కచ్ఛితంగా మొదటిపేజీ వార్తనే అవుతుంది.
అదేం చిత్రమో కానీ సదరు ప్రముఖ దినపత్రిక మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సైతం మొదటిపేజీలో అచ్చేయకపోవటం గమనార్హం. గడిచిన రెండు రోజులుగా ప్రత్యేక హోదా మీద సదరు పత్రికలో వస్తున్న వార్తలు.. ఇస్తున్న ప్రాధాన్యం చూసినప్పుడు.. సదరు దినపత్రికకు కానీ.. దాని అధినేతకు కానీ ప్రత్యేక హోదా మీద ఏదైనా ప్రత్యేక స్టాండ్ ఉందా? అన్న డౌట్ ను పలువురు సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వైఖరి సదరు ప్రముఖ పత్రిక ఇమేజ్ ను మాత్రమే కాదు.. దాని అధినేతకున్న పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది.