ఐపీఎల్... అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ప్రేక్షకులకు పసందైనా వినోదాన్ని పంచుతోంది. కరోనా కారణంగా ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఐపీఎల్ ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. ఇండియాలో జరగాల్సిన మ్యాచ్‌లు కూడా దుబాయికి షిఫ్ట్ అయిపోయాయి. ఆట ఆలస్యమైనా.. ఆటలో మాత్రం ఏ తేడా లేదు. అవే బౌండరీలు.. అవే సిక్సర్లు. స్టేడియంలో అభిమానులు లేకున్నా.. టీవీల ముందు కూర్చున్న వారు మాత్రం విజిల్స్ వస్తూనే ఉన్నారు.
అయితే.. దుబాయిలో 50 డిగ్రీలపైన ఉండే వేడి వాతావరణం ఆటగాళ్లను బెంబేలెత్తిస్తోంది. ఎంతో ఫిట్ నెస్ ఉండే విరాట్ కోహ్లీ, ధోని సైతం ఆయాసపడి కూలబడ్డారంటే అక్కడి వేడిని అర్థం చేసుకోవచ్చు.. ఐపీఎల్ ఆటగాళ్లను ఇప్పుడు గల్ప్ దేశాల్లోని వేడి వాతావరణం ఓ ఆట ఆడేసుకుంటోంది. ఓ వైపు మంచు కురుస్తూనే.. మరో వైపు ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్లేయర్స్ డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. వీటన్నింటికి తోడు ఇప్పుడు ఆయా జట్ల క్రికెటర్లను గాయాలు వేధిస్తున్నాయి.
ఐపీఎల్‌లో కీలకమైన ఆటగాళ్లు భువనేశ్వర కుమార్ (హైదరాబాద్), అమిత్ మిశ్రా (ఢిల్లీ) గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భునేశ్వర్ లేకపోవడం హైదరాబాద్‌కు పెద్ద లోటనే చెప్పాలి. భువి ఐపీఎల్ కే కాదు, ఆ తరువాత జరగబోయే ఆస్ట్రేలియా ట్రిప్‌కూ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
భవనేశ్వర్ గాయం కారణంగా సన్ రైజర్స్ జట్టులోంచి వైదొలగడంతో అతడి స్థానంలో తెలుగు కుర్రాడు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ కు దూరం కాగా.. అతడి స్థానంలో ఏపీకి చెందిన ఫృథ్వీరాజ్ యర్రాను జట్టులోకి తీసుకున్నట్లు ఎస్.ఆర్.హెచ్ తెలిపింది.
గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందని ఫృథ్వీరాజ్.. గత ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ హైదరాబాద్ పైనే కోల్ కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడాడు. ఆ మ్యాచ్ లో 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో చోటు దక్కించుకోలేదు.ఖాళీగా ఉన్న అతడిని ఎస్ఆర్.హెచ్ జట్టులోకి తీసుకుంది.