తమిళనాడు పోలీసు శాఖలో దేశంలోనే తొలిసారిగా హిజ్రా ప్రీతిక సబ్ ఇన్ స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించనుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న ఆమె పోస్టింగ్ వ్యవహారంలో ఉన్న కేసులో మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. ప్రీతికకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో మూడో కేటగిరి(హిజ్రా)లకు ఉద్యోగ కల్పనకు విధి విధానాలను రూపొందించాలని హైకోర్టు సూచాంచింది.
కొద్దిరోజుల కిందట తమిళనాడులో నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలకు హిజ్రా ప్రీతికా యాస్ని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో మూడో కేటగిరికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో స్త్రీ అని రాశారు. అయితే, పరిశీలనలో ప్రీతికా హిజ్రాగా తేలింది. దీంతో ఆమెను పరీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే, కోర్టును ఆశ్రయించి మరీ పరీక్ష రాసిన ప్రీతిక ఇప్పుడు ఉద్యోగం కూడా పొందబోతున్నారు.
రాతపరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలన్నీ పాసై సబ్ ఇన్‌స్పెక్టరు అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు సాధించినా ప్రీతికకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. హిజ్రా అన్న ఒక్క కారణంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేశారు. దీంతో ప్రీతిక మళ్లీ కోర్టు మెట్లెక్కింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు ప్రీతికకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. మూడో కేటగిరిలో ఉన్న హిజ్రాలకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి విధి విధానాలను త్వరితగతిన రూపొందించి, అమలు చేయాలని సూచించారు. దీంతో ప్రీతిక తొలి హిజ్రా సబ్ ఇన్ స్పెక్టర్ కానున్నారు.