అందాల భామ ప్రియాంకచోప్రా అందం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. వయసు పెరుగుతున్నా అమ్మడి అందాల జోరు తగ్గకపోవటమే కాదు.. మరింత ఆకర్షణీయంగా మారి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తన హవా చూపించాలని తపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉన్న ఆమెకు అనుకోని సమస్య వచ్చి పడింది.
ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. మహారాష్ట్రలోని ఫూణె నగరంలో సిద్ధార్థకు ఒక రెస్టారెంట్ ఉంది. హోటల్ మేనేజ్ మెంట్ చేసిన అతగాడు.. తనకున్న టేస్ట్ తో దాన్ని డిజైన్ చేశాడు. తమకున్న పరపతితో ఏమైనా చేయొచ్చని భావించాడో ఏమో కానీ.. రెస్టారెంట్ లో ఏకంగా హుక్కా సెంటర్ ను ఓపెన్ చేసేశాడు. అయితే.. ఇది చట్టవిరుద్ధమని తేల్చిన అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.
నో స్మోకింగ్ జోన్ కింద ఉన్నప్రాంతంలో హుక్కా సెంటర్ ను ఎలా ఓపెన్ చేస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. హుక్కా సెంటర్ ఉన్న ప్రాంతం నోస్మోకింగ్ జోనా? లేక.. రెస్టారెంట్ ఉన్న ప్రాంతం నో స్మోకింగ్ జోనా? అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి.అధికారులు పెట్టిన కేసు బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా ఉన్న వారికి చెందిన రెస్టారెంట్ మీద కేసు పెట్టేంత సాహసం అధికారులు చేయటం మామూలు విషయం కాదు కదా..?