గాంధీ కుటుంబంలోకి మరో వారసుడు దూసుకొస్తున్నాడు. ప్రియాంక గాంధీ-రాబర్ట్ వాద్రా ల మొదటి సంతానం రేహాన్ తాజాగా మీడియా కంట పడ్డాడు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో ఇతడిని చూసిన కాంగ్రెస్ నేతలు - మీడియా కూడా ఆశ్చర్యపోయారు.
ప్రముఖ రచయిత శ్రీకాంత్ రాఘవన్ రచించిన ‘ది మోస్ట్ డేంజరిస్ ప్లేస్’ అనే పుస్తకావిష్కరణ సభకు రేహాన్ తల్లితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుస్తకంపై ప్రియాంక సహా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో అందరిచూపు రేషన్ పైనే నిలిచింది.
ప్రస్తుతం రేహాన్ యూకే లో చదువుతున్నాడు. ‘డూన్’ స్కూల్ లో పదోతరగతి పూర్తి చేసిన ఇతడు ప్రస్తుతం లండన్ ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలోని కింగ్స్ కాలేజీలో ఉన్నత చదువులు చదువుతున్నాడు.
ఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో రేషన్ ను చూశాక అందరూ గాంధీ కుటుంబంలోంచి మరో వారసుడు దేశరాజకీయాల్లోకి వస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు . యూకేలో విద్యాభ్యాసం పూర్తయ్యాక రేహాన్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నెహ్రూ - ఇందిర - సంజయ్ - రాజీవ్ - రాహుల్ తర్వాత కాంగ్రెస్ పగ్గాలు అందుకునే సత్తా రేహాన్ కు ఉందంటూ కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.