కాంగ్రెస్ లో ప్రియాంకా గాంధీ పొజిషన్ ఏంటి అని అడిగితే అది తెలివితక్కువ తనం. ఆమెతోనే కాంగ్రెస్ అనుకుంటే రాజకీయ అవగాహన ఉందని అర్ధం. ఇక చూస్తే కాంగ్రెస్ లో సోనియా గాంధీ తరచూ అనారోగ్యం పాలు అవుతున్నారు. రాహుల్ గాంధీ పాలిటిక్స్ చేస్తున్నా సీరియస్ నెస్ పాలు తక్కువగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రియాంకా గాంధీ మాత్రం అలా కాదు, పట్టుదల ఎక్కువ. పైగా మామ్మ ఇందిరమ్మ పోలికలు ఉన్నాయి. దేనికైనా రెడీ అంటూ ప్రత్యర్ధుల మీద దూసుకుపోయే తత్వం. దాంతో ప్రియాంక సేవలను వాడుకోవాలని ఎట్టకేలకు కాంగ్రెస్ నిర్ణయించింది.
నిజానికి ఈ సలహాను ప్రశాంత్ కిశోర్ అనబడే రాజకీయ వ్యూహకర్త కాంగ్రెస్ కి చాలా కాలం క్రితమే ఇచ్చారు. కానీ రాహుల్ నే ముందు పెట్టాలనుకున్న సోనియాకు అది పెద్దగా నచ్చలేదు అని చెబుతారు. అయితే ఇపుడు కొడుకుతో పాటు కూతునిని కూడా ముందుకు తీసుకురావలాని ఆమె భావిస్తున్నారుట. అందుకే అర్ధ దేశాన్ని ఆమెకు అప్పగించి కాంగ్రెస్ కు మునుపటి వైభవం తీసుకురావాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మాత్రమే చూస్తూ వచ్చారు. ఆమె ఇంచార్జిగా ఉన్నారు. ఈ మధ్యనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో యూపీలో ప్రియాంకా గాంధీ కాలికి బలపం కట్టుకుని కలియతిరిగారు. ఆమె వల్ల కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చాయన్నది పక్కన పెడితే ఆమె కష్టం మాత్రం చిత్తశుద్ధితో కూడుకున్నదని అంతా ఒప్పుకున్నారు. ఏమీ లేని చోట కాని చోట కాంగ్రెస్ కి ఎంతో కొంత వెలుగులు నింపాలనుకుని ఆమె చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది.
దాంతో ఈసారి ప్రియాంకను దక్షిణాదికి పంపాలని చూస్తున్నారు. ఏకంగా దక్షిణాది రాష్ట్రాలకు ఆమెను ఇంచార్జిగా చేయాలని చూస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ కి ఎంతో బలం ఉండేది. ఇందిరమ్మను ఉత్తరాదిన ఓడిస్తే కర్నాటకలోని చిక్ మగలూరు నుంచి గతంలో గెలిచారు. అంతేనా ఎమర్జెన్సీ తో ఉత్తరాది సహా దేశమంతా ఇందిరాగాంధీకి వ్యతిరేక ప్రభంజనం వీస్తే ఏపీలో తిరుగులేని ఆధిక్యతతో కాంగ్రెస్ ని గెలిపించిన అందమైన గతమూ ఉంది.
తమిళనాడులో ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ వారితో సఖ్యతగా ఉంటూ ఎంపీల మద్దతు అందుకుంటూ వస్తోంది. కర్నాటకలో బలంగా ఉంది. కేరళలో ఒకసారి లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే మరోసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చేది. ఇలా చూస్తే కనుక సౌత్ లో 119 సీట్లు ఉన్నాయి. ఇపుడు ఈ సీట్లలో కాంగ్రెస్ కి సొంతంగా పట్టుమని పది వస్తాయన్న ఆశ లేదు. అయితే తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి అక్కడ మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కూటమివే. కర్నాటకలో కొంత ఆశ ఉంది. కేరళలో రెండు సార్లు వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్. దాంతో అక్కడ మరమ్మతు చేసుకోవాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణాలో భారీ ఆశలు ఉన్నా సొంత పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు బాగా ఉన్నాయి.
దాంతో వాటిని సరిచేసుకుంటే ఏమైనా గెలుపు అవకాశం ఉంటుంది. ఏపీలో ఇప్పటికిపుడు గెలవకపోయినా ఉనికి చాటుకునే ప్రయత్నం 2024 ఎన్నికల్లో చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. మరి ఇవన్నీ జరగాలీ అంటే ఎవరికో బాధ్యతలు అప్పగిస్తే కుదదరు, అందుకే నేరుగా ప్రియాంకా గాంధీనే బరిలోకి దిగుతున్నారు. ఆమె గ్లామర్ తో పాటు నాన్నమ్మ పోలికలు, కాంగ్రెస్ చరిష్మా ఇవన్నీ కలసి దక్షిణాదిన ఈసారి మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే రేపటి రోజున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు అన్న ఆశ ఉందిట. అందుకే ప్రియాంకను బరిలోకి దింపుతున్నారు అంటున్నారు. తొందరలో జరిగే కాంగ్రెస్ సీ డబ్య్లూ సీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో కేసీయార్ ఏపీలో జగన్ తన టార్గెట్లుగా ప్రియాంక పెట్టుకున్నారు అంటున్నారు.
ఈ ఇద్దరు నేతల మీద ఇందిరమ్మ మనవరాలు నేరుగా అటాక్ చేస్తారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వైఎస్సార్ ఫ్యామిలీ ఇపుడు సొంత పార్టీ పెట్టి సవాల్ చేయడమే కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని లాక్కుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా అంటున్నారు. అందుకే ప్రియాంక రంగంలోకి దిగుతున్నారు అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ పోరు ఎలా సాగుతుందో.