కాంగ్రెస్ పార్టీలో అమ్మ ప్రస్థానం ముగిసినట్లే. 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని చేపట్టి.. నడిపించిన సోనియాగాంధీ తనకు విశ్రాంతి అవసరమన్న విషయాన్ని చెప్పటమే కాదు.. అనుకున్నట్లే కొడుక్కి కాంగ్రెస్ కిరీటాన్ని పెట్టేశారు. రాహుల్ పట్టాభిషేకానికి ముందు తానిక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానన్న మాటను చెప్పటం తెలిసిందే. మరి.. అమ్మ విశ్రాంతి తీసుకుంటే.. మరి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గం మాటేమిటి? ఆ నియోజకవర్గాన్ని అమ్మ తర్వాత తీసుకునేది ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ సందేహాలకు సమాధానంగా ప్రియాంక అన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే.. ఇలాంటి అంచనాలపై తాజాగా స్పందించారు ప్రియాంక వాద్రా. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సోనియా నేతృత్వం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఒక ఆంగ్ల మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.
తాను వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రియాంక మాటతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో లేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే.
ఎందుకిలా అంటే.. రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు పెట్టిన వేళలోనే.. ప్రియాంక కూడా ఎంట్రీ ఇస్తే.. పార్టీలో రెండు పవర్ పాయింట్లు ఏర్పడతాయని.. పార్టీపై పూర్తిస్థాయి పట్టు రాహుల్ చేతిలో ఉండదని.. అందుకే.. ఎప్పటి మాదిరే తెర వెనుక ఉండి పావులు కదపాలన్న ఉద్దేశంలో ప్రియాంక ఉన్నట్లుగా చెబుతున్నారు. తన సోదరుడికి అండగా ఉండటం.. పార్టీ మొత్తం రాహుల్ తప్ప మరెవరూ లేరన్న విషయాన్ని స్పష్టం చేసే ఉద్దేశంతోనే ప్రియాంక మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం మరో ఏడాది ఉండటం.. అప్పటి పరిస్థతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని.. ముందే మాట్లాడటం ద్వారా లేనిపోని వాదనలకు తెర తీయకూడదన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తతో రాయ్ బరేలీ నుంచి తాను పోటీ చేయటం లేదన్న మాటను ప్రియాంక చెప్పారని చెబుతున్నారు. ఏమైనా.. ప్రియాంక ఇచ్చిన క్లారిటీ అనవసరమైన వాదనలకు చెక్ పెట్టేలా ఉందని చెప్పక తప్పదు. అదే సమయంలో తన తల్లి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పటం గమనార్హం. సో.. ప్రియాంక ఎంట్రీకి మరికాస్త టైం ఉందన్న మాట.