21 ఏళ్లకే ప్రేమ.. 44 ఏళ్లకే ఆ విషాదం!

Update: 2023-01-17 06:40 GMT
తన తల్లి సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో జన్మించిన తన తల్లి 21 ఏళ్లకే తన తండ్రి రాజీవ్‌ గాంధీతో ప్రేమలో పడ్డారన్నారు. తన తండ్రిని పెళ్లాడిన తర్వాత భారత్‌ కు వచ్చిన ఆమె భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు కష్టపడ్డారని తెలిపారు. అప్పట్లో ఆమెకు రాజకీయాలంటే అసలు ఇష్టం లేదని ప్రియాంకా వ్యాఖ్యానించారు. 21 ఏళ్లకు ప్రేమలో పడ్డ తన తల్లి 44 ఏళ్ల వయసులో ఆమె భర్త (రాజీవ్‌ గాంధీ)ని కోల్పోయారని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటక పీసీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇద్దరు ధైర్యవంతులయిన తన తల్లి సోనియా, నాయనమ్మ ఇందిరా గాంధీ చేతుల్లో తాను పెరిగానని చెప్పారు.

"నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే ఇందిరా గాంధీ తన 33 ఏళ్ల కుమారుడిని పోగొట్టుకున్నారు. సంజయ్‌ గాంధీ మరణించిన మరుసటి రోజు నుంచే నాయనమ్మ విధులకు హాజరయ్యారు. కర్తవ్యం పట్ల ఆమెకున్న నిబద్ధత, శక్తి అటువంటివి. ప్రాణాలు కోల్పోయేవరకూ దేశ సేవ చేశారు" అని నాయనమ్మ ఇందిరా గాంధీని ప్రియాంక ఈ సందర్భంగా తలుచుకున్నారు.

ఇక తన తల్లి సోనియా గాంధీ గురించి కూడా ప్రియాంకా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు 21 ఏళ్ల వయసున్నప్పుడే రాజీవ్‌ గాంధీతో ప్రేమలో పడ్డారని వెల్లడించారు. రాజీవ్‌ ను పెళ్లి చేసుకునేందుకు సోనియా గాంధీ ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారని తెలిపారు.

అలాగే భారతీయ సంప్రదాయాలు నేర్చుకునేందుకు మొదట్లో చాలా కష్టపడ్డారని వివరించారు. నిదానంగా ఇక్కడి పద్ధతులన్నీ నేర్చుకున్నారన్నారు. అలాగే తన తల్లి ఆమె అత్తమ్మ ఇందిరా గాంధీ నుంచి ఎన్నో ముఖ్య విషయాలను నేర్చుకున్నారని పేర్కొన్నారు.

తన తల్లి సోనియా గాంధీ 44 ఏళ్ల చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు రాజకీయాలు ఇష్టం లేనప్పటికీ దేశానికి సేవ చేసేందుకే నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు. అలా ఆమె తన జీవితాన్ని దేశసేవ కోసమే కొనసాగిస్తున్నారు కొనియాడారు.

జీవితంలో ఏం జరుగుతుంది, ఎంతటి విషాదాన్ని ఎదుర్కొంటామనేది ముఖ్యం కాదని ప్రియాంకా వ్యాఖ్యానించారు. ఇంటాబయట ఎటువంటి కష్టాలు వచ్చినా స్వయంగా ఎదుర్కోవచ్చంటూ మహిళలకు భరోసా ఇచ్చారు.

తన తల్లి సోనియా గాంధీ, తన తండ్రి రాజీవ్‌ గాంధీ, తన నాయనమ్మ ఇందిరా గాంధీ గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News