ఎంట్రీతోనే అదరగొట్టిన గాంధీల వారసుడు

Update: 2020-02-09 06:49 GMT
సోనియాగాంధీ.. ఆమెకు వారసులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. రాహుల్ గాంధీ గత ఎన్నికలలో ఓడిపోయి అస్త్ర సన్యాసం చేసి రాజకీయాలు వదిలేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇక గాంధీల కుటుంబానికి ఆశ శ్వాస ప్రియాంక గాంధీనే.. ఇక రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడం.. పిల్లలు లేకపోవడంతో ఆయన వారసత్వం కూడా గాంధీ కుటుంబానికి లేకుండా పోయింది.

అందుకే ఇప్పుడు వారసత్వం అయినా వారసులు అయినా ప్రియాంక గాంధీ వైపే కాంగ్రెస్ వాదులంతా చూస్తున్నారు. తాజాగా గాంధీ ఫ్యామిలీ నుంచి నాలుగో తరం ఎంట్రీ బయటకు వచ్చేసింది.

ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారి బయట కనిపించాడు. 19 ఏళ్ల రైహాన్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తల్లి , తండ్రితో కలిసి ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ కు వచ్చాడు. మొత్తం మీడియా దృష్టి ఇప్పుడు రైహాన్ పై పడింది.

భవిష్యత్ గాంధీల కుటుంబానికి రైహానే వారసుడు అని ఢిల్లీ మీడియా కోడై కూసింది.  రాజకీయాలపై ఇతడు దూసుకొస్తాడని చెప్పుకొచ్చారు.

రైహాన్ కూడా మీడియాతో మాట్లాడడం విశేషం. ప్రజల కోసం ఓటు వేశానని.. కొత్త ప్రభుత్వం ప్రధానంగా ప్రజరావాణాపై దృష్టి సారించాలని..విద్యార్థులకు రాయితీలు ఇవ్వాలని రైహాన్ కోరాడు. రైహాన్ సమాధానానికి ప్రియాంక, రాబార్ట్ వాద్రా ఫిదా అయ్యారు. కొడుకు మెచ్చురిటీకి ఆశ్చర్యపోయారు. మీడియా సైతం ఈ కుర్రాడిలో విషయం ఉందంటూ ఆకాశానికెత్తేసింది.
Tags:    

Similar News