పాములంటే హడలిపోతారు. అబ్బాయిల సంగతి ఇలా అయితే.. అమ్మాయిల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడేమీ అమ్మాయిల్ని కించపర్చటం ఉద్దేశం కాదు. సహజంగానే పాములన్నంతనే కాస్త బెదురు ఉంటుంది. ఇక.. ప్రముఖుల విషయం గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రియాంక వాద్రా వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆమెకు ఎంత ధైర్యం అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. బొమ్మలతో ఆడుకున్నంత సింఫుల్ గా పాముల్ని పట్టుకున్న తీరు పలువురి దృష్టిలో పడటమే కాదు.. బెరుకు లేని ఆమె తీరు ఇప్పుడు ఫిదా చేస్తోంది
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ప్రియాంక తన తల్లి బరిలో ఉన్న రాయ్ బరేలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజల్ని కలుస్తూ.. వారి బాగోగుల గురించి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరుతున్న ఆమె.. పార్టీ అధికారంలోకి వస్తే.. అన్నివర్గాల ప్రజల్ని ఆదుకుంటుందన్నారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్ బరేలిలో పాములు ఆడించే వారిని కలుసుకొని.. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పాము బుట్టలోని పామును చేతిలోకి తీసుకోవటమేకాదు.. బుట్టను శుభ్రం చేసి.. అందులో పామును జాగ్రత్తగా అమ్చటం ఒక ఎత్తు అయితే.. మరో పాములున్న వ్యక్తి బుట్టలోని చిన్న పామును చేతిలోకి తీసుకొని.. పట్టుకున్న తీరు ఇప్పుడు ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పాము అన్నంతనే పట్టుకునేందుకు బెరుకు ప్రదర్శించే తీరుకు భిన్నంగా.. చాలా క్యాజువల్ గా పాముల్ని డీల్ చేసిన ప్రియాంక తీరు చూస్తే.. ఆమెలో ధైర్యం పాళ్లు టన్నులు.. టన్నుల అన్న రీతిలో తాజా సీన్ ఉందని చెప్పాలి.
Full View