కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి, ఆమె కుటుంబానికి కొత్త భయం పట్టుకుందట. ఏ క్షణాన్నైనా తమ అల్లుడు రాబర్ట్ వాధ్రాకు అరదండాలు తప్పకపోవచ్చని బాగా టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు రియలెస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ తో ఉన్న భూ లావాదేవీలపై హర్యాణా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో వాధ్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే... వాధ్రాతో పాటు ఆయన భార్య ప్రియాంక వాధ్రా(సోనియా కుమార్తె)కు కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉండడంతో ఆమెను తప్పించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రియాంక చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి.
తన భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక లావాదేవీలతో కాని, ఆయన కంపెనీలతో కాని తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు రియలెస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ తో ఉన్న భూ లావాదేవీల విషయంలో తనకెలాంటి సంబంధం లేదని ఆమె ప్రకటించారు.
హర్యాణాలోని ఫరీదాబాద్ లో 2006లో ప్రియాంకా గాంధీ 5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 15 లక్షలకు కొన్నారు. ఆ తర్వాత అదే యజమానికి ఆ భూమిని 2010లో రూ. 80 లక్షలకు (అప్పటి మార్కెట్ విలువ) అమ్మినట్టు ఆమె తెలిపారు. ఈ డబ్బును కూడా కేవలం చెక్ ద్వారానే తీసుకున్నానని చెప్పారు. అయితే, ఈ భూమిని ఆమె భర్తే కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ప్రియాంక, అవన్నీ నిరాధారమైన వార్తలంటూ కొట్టి పారేశారు.
అయితే... వాధ్రా, ప్రియాంకలు ఎన్ని కబుర్లు చెప్పినా హర్యాణా ప్రభుత్వం వద్ద మొత్తం సమాచారం ఉందని... ఆ వ్యవహారంలోని లొసుగులన్నీ ఇప్పటికే గుర్తించారని.. వాధ్రా అరెస్టు తప్పదని అంటున్నారు. అయితే... ప్రియాంక జోలికి పోకపోవచ్చని అంటున్నారు. అలా చేస్తే కాంగ్రెస్ కు అది మంచి సింపథీ తెస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/