ప్రియాంక ఎంట్రీ లేదంటున్నారు

Update: 2017-08-14 14:31 GMT
ఇటీవ‌లి కాలంలో తీవ్ర ఎదురుదెబ్బ‌లు తింటున్న కాంగ్రెస్ నాయకత్వంలో త్వరలోనే మార్పు రానుందని, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను సోనియాగాంధీ తన కుమార్తె ప్రియాంకకు అప్పగించనున్నార‌ని వ‌చ్చిన వార్త‌లకు ఆదిలోనే బ్రేక్ ప‌డింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను ప్రియాంకకు అప్పగిస్తారని వస్తున్న వార్తలు ఉత్తివేన‌ని ఆమె వ్యక్తిగత స‌హాయ‌కులైన‌ పీ సహాయ్ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలేవి పార్టీలో చ‌ర్చ‌కు రాలేద‌ని తేల్చిచెప్పారు.

క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రియాంకను నియమించాలని సోనియా ప్రతిపాదన తెచ్చినట్లు జాతీయ మీడియా వార్త‌లు రాసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న సోనియా గాంధీ.. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వం అవసరమని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. సోనియా ప్రతిపాదనకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మద్దతు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రియాంక గాంధీని నియమిస్తారని వార్తలు షికారు చేశాయి. అయితే ఈ విష‌యంలో ప్రియాంక వ్య‌క్తిగ‌త సిబ్బంది క్లారిటీలో ఇవ‌న్నీ అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది.
Tags:    

Similar News