అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సాఫ్టువేర్ ఇంజినీర్లకు ఏసీ గదుల్లోనూ చెమటలు పడుతున్నాయట.. చొక్కాలు తడిసిపోతున్నాయట. ముఖ్యంగా బడా ఐటీ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు భయపడుతున్నాు. ఐఎస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా చెప్పే ‘క్యాలిఫేట్ సైబర్ ఆర్మీ (సీసీఏ)’ నాలుగు వేల మందితో కూడిన ‘కిల్ లిస్ట్’ను ఇటీవల విడుదల చేసింది. అందులో దేశాధినేతలు - ఇతర మతాలకు చెందిన ప్రముఖులతో పాటు సాఫ్టువేర్ ఇంజినీర్ల పేర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయట. తమను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో ఆయా దేశాలకు సహాయంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను టార్గెట్ చేసినట్లు సీసీఏ ప్రకటించింది.
మొత్తం 4 వేల మందితో కూడిన ఈ జాబితాలో మెజారిటీ సంఖ్యలో అమెరికన్లే ఉన్నారు. అయితే.. ఈ జాబితాలో 285 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇక బ్రిటన్ - ఫ్రాన్సు - కెనడాలకు చెందినవారు కూడా ఇందులో ఉన్నారు. జాబితాలో పేర్కొన్న వ్యక్తుల పేర్లతో పాటు వారి చిరునామాలు - ఈ-మెయిల్ ఐడీలు తదితర సమగ్ర వివరాలను వెల్లడించిన ఈ సంస్థ... జాబితాలో ఉన్న వారిని తక్షణమే చంపేయాలంటూ తన సానుభూతిపరులకు పిలుపునిచ్చింది. జాబితాలో ఎక్కువ మంది సాఫ్టువేర్ ఇంజినీర్లు ఉండడంతో వారంతా ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
కొన్ని దేశాల ప్రభుత్వాలు సీసీఏ లిస్టులో ఉన్న సాఫ్టువేర్ ఇంజినీర్లకు భద్రత కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నాయి. అయితే.. ఐఎస్ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రభుత్వాలకు టెక్నికల్ సపోర్టు ఇస్తున్న సాఫ్టువేర్ ఇంజినీర్లలో కొందరు ఇక తాము ఆ పని చేయలేమంటూ పక్కకు తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మునుపెన్నడూ లేనట్లుగా ఉగ్రవాదులు ప్రత్యేకించి సాఫ్టువేర్ ఇండస్ర్టీని టార్గెట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాగా సాఫ్టువేర్ రంగానికి చెందిన కొందరు మాత్రం ఐఎస్ ఆన్ లైన్ వేదికగా సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే శక్తి కేవలం సాఫ్టువేర్ నిపుణులకే ఉందని.. కాబట్టి ప్రాణాలకు భయపడకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని అంటున్నారు. దీంతో ఇది ఐఎస్ వర్సెస్ ఐటీ యుద్ధంగా మారుతున్నట్లుగా ఉంది.