జ్ఞానవాపి వివాదం దేశంలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.ఈ కేసు పరిణామాలు సుప్రీంకోర్టు వరకూ చేరాయి. ఇందులో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది.జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతోపాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తేల్చిచెప్పింది.
ఈమేరకు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ పరిణామాలపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అదే వివాదాస్పదమైంది. అతడి అరెస్ట్ కు దారి తీసింది.
ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఏం పోస్టు పెట్టాడంటే.. ‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. ఇది కొత్తేమీ కాదు.. నేను చరిత్రకారుడిని.. అనేక పరిశీలనలు చేశాను.
నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. లాల్ అసిసోసయేట్ ఫ్రొఫెసర్ ఉద్యోగంతోపాటు దళిత సమస్యలపై పనిచేస్తున్నారు.
‘అంబేద్కర్ నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు కూడా.. దీనికి ఆయన ఎడిటర్ ఇన్ చీఫ్.. లాల్ పోస్ట్ రెచ్చగొట్టేలా ఉందని ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అసోసియేట్ ప్రొఫెసర్ ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం కాస్త ఈ ప్రొపెషర్ అరెస్ట్ కు దారితీసింది. చరిత్రపై ఆయనుకున్న జ్ఞానమే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సున్నితమైన వ్యవహారంలో మత విద్వేషాలకు దారితీసే పరిస్థితి ఉందని.. ఎవరూ దీనిపై మాట్లాడవద్దని పలువురు సూచిస్తున్నారు.