రీల్ శైలాజారెడ్డి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. యాదృశ్చికంగా రియల్ శైలజారెడ్డి ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. ఈ చోటా రాజకీయ నాయకురాలి ఉదంతం మొత్తం వింటే ఫిదా పక్కా. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఆమె చేసిన పని వార్తగా ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే....
చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజా సత్యనారాయణ రెడ్డి. షార్ట్ కట్ లో శైలజా రెడ్డిగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన రాజకీయ నేతలకు భిన్నం ఆమె. ఎన్నికల వేళ తాను చెప్పిన మాటను నెరవేర్చటం కోసం సొంత ఆస్తిని అమ్మటానికి సైతం వెనుకాడని తత్త్వం ఆమె సొంతం. తాను జెడ్పీటీసీగా ఎన్నికైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.
ఇందుకు తగ్గట్లే ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నిస్తే చుక్కెదురైంది. దీంతో.. ప్రజలకు తానిచ్చిన హామీల్ని అమలు చేసేందుకు ఆమె ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనులు చేయిద్దామంటే అవి రాకపోవటంతో నిరాశకు గురయ్యారు.
అంతలోనే తేరుకొని ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు. చేవెళ్లలోని నేషనల్ హైవే పక్కనున్న తన ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఫ్లాట్ ను అమ్మగా వచ్చిన రూ.24 లక్షలతో మండలంలోని అభివృద్ధి పనుల్ని చేపట్టారు. ఎన్నికల వేళ తాను చేస్తానని చెప్పిన పనుల కోసం తన సొంత ఆస్తిని అమ్మి మరీ ఖర్చు చేయటంతో శైలజా రెడ్డి మండలంలోనే కాదు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఆమెకు సాటి వచ్చే వారెవరూ కనిపించరని చెప్పక తప్పదు. కీపిటప్ శైలజారెడ్డి!