నమ్మటానికి వీల్లేనట్లుగా ఉన్నా ఇది నిజం. బజ్జీల వ్యాపారం చేసుకుంటూ పొట్టబోసుకునే వ్యక్తి ఏకంగా రూ.2వేల కోట్ల ఆస్తుల్ని కూడగట్టటం సాధ్యమేనా? సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్లు ఉంటాయని అనుకుంటాం కానీ.. రియల్ లైఫ్ లోనూ ఇలాంటివి సాధ్యమేనని నిరూపించారు గుజరాత్ కు చెందిన వడ్డీ వ్యాపారి కిశోర్ భజీవాలా. 31 ఏళ్ల క్రితం బజ్జీల వ్యాపారం బతుకుబండి లాగించిన ఇతగాడు మూడు దశాబ్దాల వ్యవధిలో ఇంత భారీఎత్తున ఆస్తులు ఏ విధంగా కూడబెట్టాడన్న విషయంపై అధికారులు దృష్టి సారించినప్పుడు ఇతగాడి లీలలుబయటకు వచ్చాయి.
పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని బయటకు వచ్చిన ఈ పెద్ద తిమింగళం రేంజ్ ఏమిటన్న విషయాన్ని సింఫుల్ గా.. సూటిగా చెప్పాలంటే.. తన దగ్గరి పెద్దనోట్లను మార్చేసేందుకు ఏకంగా 700 మందిని రంగంలోకి దింపటమేకాదు.. ఇందులో 212 మందిని కేవలం నోట్ల మార్చటంపైనే ఫోకస్ చేసేలా ఆర్డర్ వేశాడు. వందలాది మంది చేత రూ.లక్ష మొదలు రూ.3లక్షల వరకూ బ్యాంకు లావాదేవీలు జరిపించిన ఇతగాడి వ్యవహారంపై సందేహం వచ్చిన అధికారులు.. సోదాలు జరిపినప్పుడు రూ.10.45 కోట్లు దొరికాయి. తాజాగా ఇతగాడి ఆస్తుల మీద మరోసారి తనిఖీలు చేసిన సందర్భంలో ఇతగాడి ఆస్తి తక్కువలో తక్కువ రూ.1300 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకూ ఉంటుందన్న అంచనాకు వచ్చారు అధికారులు.
ఇంత భారీ మొత్తాన్ని కేవలం మూడు దశాబ్దాల సమయంలో ఎలా సంపాదించాడన్న అంశంపై దృష్టి సారించిన అధికారులకు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. సాదాసీదా వ్యక్తి అయిన కిశోర్ కొన్నేళ్ల క్రితం గుజరాత్ లోని ఉదనా గ్రామానికి వలస వచ్చాడు. అక్కడ టీ.. బజ్జీలు అమ్మే వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఐదారేళ్ల వ్యవధిలో వ్యాపారం పుంజుకుంది. తాను సంపాదించిన సంపాదనను వడ్డీలకు ఇచ్చేవాడు.
2007లో బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. వడ్డీ కట్టలేని అమాయకుల ఆస్తుల్ని బలవంతంగా రాయించుకున్న ఇతగాడు.. విలాసవంతమైన విల్లాలు కట్టే వ్యాపారంలో తన సంపాదనను డంప్ చేశాడు. మొత్తం 13 భారీ వెంచర్లలో డబ్బులు పెట్టిన ఇతగాడు ఆ తర్వాత కాలంలో భారీగా సంపాదించాడు. సొంతూరిలో ఓ పెద్ద బిల్డింగ్ కట్టిన కిశోర్.. దాన్ని సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంకు.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు అద్దెకు ఇచ్చాడు. కోఆపరేటివ్ బ్యాంకులో ఏకంగా 27 ఖాతాలు తెరిచాడు. ఇందులో 20 ఖాతాలు బినామీలవే కావటం గమనార్హం. మొత్తం 16 లాకర్లు తీసుకొని తన నల్లధనాన్ని నింపేశాడు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ సాయంతో రూ.2వేల నోట్లను మార్చేసుకునేక్రమంలో దొరికిపోయిన ఇతగాడి వ్యవహారం ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసేలా చేసింది. ఇలాంటి భారీ తిమింగళాలు మరెన్ని బయటకు వస్తాయో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/