నిర‌స‌న కోసం అలా న‌రికేసి తీసుకురావాలా?

Update: 2017-06-17 04:52 GMT
మేమేం తినాలి? అన్న‌ది ప్ర‌భుత్వాలు చెప్పేదేమిటి? అన్న‌ది ప‌శువ‌ధ‌పై విధించిన బ్యాన్‌ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్న వారు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు. దీని మీద చ‌ర్చ మొద‌లుపెడితే ఒక ప‌ట్టాన పూర్తి కాదు. ఎవ‌రికి వారు త‌మ త‌మ వాద‌న‌ల్ని జోరుగా వినిపిస్తుంటారు. ఆహారం కోసం చాలానే ఉన్న‌ప్పుడు.. కొన్నింటి విష‌యంలో ప‌రిమితులు పెట్టుకోలేమా? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు ప్ర‌భుత్వం విధించిన నిషేధం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుంటారు.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య హాట్ హాట్ గా సాగుతున్న చ‌ర్చ‌లు ఇలా ఉంటే.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కొంద‌రు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఇవి.. శృతి మించిన‌ట్లుగా ఉండ‌టం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తెర తీస్తోంది. కేంద్ర నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే ప‌నిలో భాగంగా.. బీఫ్ విందులు ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రికొంద‌రు బ‌హిరంగంగా జంతువుల్ని వ‌ధిస్తున్నారు. అదేమంటే.. కేంద్ర నిర్ణ‌యానికి నిర‌స‌న తెల‌ప‌టానికే అని త‌మ చ‌ర్య‌ల్ని స‌మ‌ర్థించుకుంటున్నారు.

మూగ‌జీవాల్ని అడ్డ‌గోలుగా చంపేయ‌టం అమానుష‌మ‌న్న విష‌యాన్ని నిర‌స‌న‌ల హ‌డావుడిలో ప‌లువురు మ‌ర్చిపోవ‌టం బాధించేదే. తాజాగా త‌మిళ‌నాడులో ఇలాంటి దుర్మార్గ‌మే ఒక‌టి చోటు చేసుకుంది. ప‌శువ‌ధ‌పై విధించిన నిషేధాన్ని వ్య‌తిరేకిస్తూ ఆది త‌మిళ‌ర్ పేర‌వైకి చెందిన 20 మంది కార్య‌క‌ర్త‌లు కోయంబ‌త్తూరులో చేప‌ట్టిన నిర‌స‌నను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

కోయంబ‌త్తూరు రెడ్ క్రాస్ భ‌వ‌నం ఎదుట బీఫ్ విందు నిర్వ‌హించ‌టానికి అనుమ‌తి కోర‌గా.. పోలీసులు అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో.. కొంద‌రు నిర‌స‌న చేప‌ట్ట‌గా.. మ‌రో ఇద్ద‌రు యువ‌కులు జంతు త‌ల‌ను బ‌హిరంగంగా తీసుకురావ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది. త‌మ వాద‌న‌ను స‌మ‌ర్థించుకోవ‌టానికి వీలుగా మూగ జీవాల్ని వ‌ధించి.. వాటిని బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న‌కు తీసుకురావ‌టంలో అర్థ‌మేమిటో అర్థం కానిది.

ఇదిలా ఉంటే కేంద్ర పాలిత  ప్రాంత‌మైన పుదుచ్చేరి అసెంబ్లీ తాజాగా ఒక తీర్మానం చేసింది. ప‌శువ‌ధ నిషేధానికి వ్య‌తిరేకంగా తీర్మానం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టం.. ప్ర‌జ‌ల ఆహార‌స్వేచ్ఛ‌పై దాడి లాంటిద‌ని పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా చేప‌ట్టే ప‌శువ‌ధ‌పై ఆంక్ష‌ల్ని విధించ‌టాన్ని వ్య‌తిరేకిస్తున్న ఈ ర‌చ్చ రానున్న రోజుల్లో మ‌రెంత‌కు ముదురుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News