టీడీపీ ఎమ్మెల్యేకు టికెట్ వద్దంటూ నిరసన

Update: 2019-03-13 10:45 GMT
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం విషయంలో రచ్చ మొదలైంది. ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు మంగళవారం బాహాబాహీకి దిగి రచ్చకెక్కారు. ఒక వర్గం వారు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగానూ.. ఇంకొందరు ఆమెకు అనుకూలంగా బలప్రదర్శన చేశారు.

సీఎం చంద్రబాబు రంపచోడవరం టీడీపీ టికెట్ పై కసరత్తు చేసి చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరివైపే మొగ్గు చూపింది. ఆమె ప్రకటన లాంఛనమే అనుకుంటున్న సమయంలో ఈ పరిణామాలు అమరావతి వేదికగా ఇరు వర్గాల రచ్చ చోటుచేసుకోవడంతో చంద్రబాబు తిరిగి పార్టీ ముఖ్య నేతలతో సమావేశానికి ఆదేశించారు.

ముఖ్యమంత్రికి అనుబంధంగా ఉన్న నియోజకవర్గాల వివాదాల పరిష్కార కమిటీ రంపచోడవరం టికెట్ ను ఆశించే ఎమ్మెల్యే రాజేశ్వరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్, కొమరం ఫణేశ్వరమ్మ, ఇతర ఆశావహులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ చర్చల అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఒకరిద్దరు ముఖ్య ఆశావహులతో చంద్రబాబు ముఖాముఖిగా సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  మంగళవారం అర్ధరాత్రిగానీ.. బుధవారం ఉదయానికి గానీ ఈ అభ్యర్థిత్వాన్ని తేల్చేస్తారని భావిస్తున్నారు.


Tags:    

Similar News