టోక్యో ఒలంపిక్స్ పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు.. వైద్యులు ఏమంటున్నారంటే!
కరోనా నేపథ్యంలో టోక్సో ఒలంపిక్స్ పట్ల ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. జూలై 23 నుంచి జరగనున్న క్రీడల పట్ల జపాన్ దేశస్థులు తీవ్రం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్కర కాలంలో క్రీడలు నిర్వహించకూడదని జపనీయులు డిమాండ్ చేస్తున్నారు. టోక్యో ఒలంపిక్స్ నిర్వంచహించవద్దని కోరుతూ వారం రోజులుగా ఆందోళనలు ఉద్ధృతం చేశారు.
జపాన్ లో నిర్వహించిన ఓ సర్వేలో ఆ దేశంలో 80 శాతం మంది ఈసారి ఒలంపిక్స్ నిర్వహించకూడదని కోరినట్లు వెల్లడైంది. ఈ మహమ్మారి కాలంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి దేశస్థులు వాపోయారు. అంతేకాదు ఎంతోమంది ఉద్యోగాలు పోయి ఉపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో కోట్లను ధారపోసి ఒలంపిక్స్ నిర్వహించడం ఎంత వరకు కరెక్ట్ అని జపనీయులు ప్రశ్నిస్తున్నారు.
గతేడాది కాలంగా దాదాపు అన్ని క్రీడలు, వేడుకలు మహమ్మారి కారణంగా రద్దయ్యాయని ఒలంపిక్ ఉన్నతాధికారి తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఒలంపిక్స్ వాయిదా పడడం ఇదే మొదటిసారని వెల్లడించారు. ఈ సారి అలా జరగకుండా చూసుకుంటామని అన్నారు. టోక్యో ఒలంపిక్స్ లోని అన్ని క్రీడలకు సంబంధించిన 148 క్రీడాకారుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అథ్లెట్లందరూ కనీసం టీకా మొదటి మోతాదును తీసుకోవాలనే నిబంధనను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. వారిలో 17 మంది రెండు డోసులు, మిగతా 131 మంది తొలి డోసును తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒలంపిక్స్ నిర్వహిస్తారా అని ఓ అధికారిని ప్రశ్నించినప్పుడు తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. జపాన్ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వైద్యులు మాత్రం క్రీడలను వాయిదా వేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో ఒలంపిక్స్ మంచిది కాదని హెచ్చరించారు. జపాన్ లో ఇప్పటివరకు 4.1శాతం మందికి టీకా ఇచ్చింది. వైద్య సిబ్బందిలో సగం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఆగస్టు 24న టోక్యో పారా ఒలంపిక్స్ జరగనున్నాయి. మరి ఈ ఒలంపిక్స్ వివాదం ఎంతవరకు పోతుందో? చూడాలి.