పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన్ క్షేమంగా తిరిగి ఇండియాకు రావాలని దేశమంతా కోరుకుంటోంది. ఆరోగ్యంతో తిరిగిరావాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, మసీదు, చర్చిల్లో అభినందన్ కోసం ఇప్పుడు దేశమంతా సర్వమత ప్రార్థనలు కొనసాగుతున్నాయి.
తన కొడుకు పాక్ సైన్యం చేతిలో బంధీగా ఉండడంపై అభినందన్ తండ్రి స్పందించారు. దేవుడి దయ వల్ల అభినందన్ బతికి ఉన్నాడని పేర్కొన్నారు. సృహలోనే ఉన్నాడని.. గాయాలేమీ కాలేదని తెలిపారు. అభినందన్ పాక్ సేనల చేతిలో ఉన్న చూపిస్తున్న ధైర్యసాహసాలు అభినందనీయమన్నారు.. నిన్ను చూసి దేశం గర్వపడుతోంది అంటూ కొడుకు ధీరోధాత్తంపై కన్నీల్లు కార్చాడు తండ్రి.
కాగా అభినందన్ క్షేమంగా భారత్ కు తిరిగి రావాలని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకువస్తోంది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అభినందన్ తండ్రి కేంద్రాన్ని కూడా కోరారు. అభినందన్ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నా.. దేశవ్యాప్తంగా ప్రజల ప్రార్థనలు ఫలించాలని మీ ఆకాంక్షతో మరింత శక్తి - సామర్థ్యాలు అభినందన్ కు రావాలని కోరుకుంటున్నానని... కేంద్రానికి ఇదే విన్నవించానని తెలిపారు.