సినిమాటిక్ మలుపులు తిరుగుతోంది తమిళనాడు రాజకీయాలు. ఇప్పుడిప్పుడే సీఎం కుర్చీలో కుదురుకుంటున్న పన్నీరు సెల్వంకు సెగ పెడుతూ.. చిన్నమ్మ సీఎం కుర్చీలో కూర్చునేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. విధేయడికి కేరాఫ్ అడ్రస్ అయిన పన్నీరు తన తీరుకు భిన్నంగా చిన్నమ్మకు రివర్స్ అటాక్ చేస్తూ వేడి రాజేస్తున్నారు. ఆటలో అరటిపండు మాదిరి అమ్మ మేనకోడలు దీప మధ్య మధ్యలో చేస్తున్న వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల మీద మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్నాయి.
ఇలాంటి వేళలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నోటి వెంట ‘పవర్’ మాట వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న తేడా మాటను పట్టించుకోవాల్సిన నేపథ్యంలో రజనీ నోటి నుంచి వచ్చిన పవర్ మాట మీద ఆసక్తి వ్యక్తమవుతుంది. అయితే.. తరచి చూస్తే సూపర్ స్టార్ పవర్ మాటల్లో ఎలాంటి ప్రత్యేకత లేదని చెప్పాలి.
పవర్ అంటే పదవులు కాదని.. అధ్యాత్మికంగా అభివర్ణించిన ఆయన.. తమిళనాడు రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఆస్తులు.. హోదా.. సంతోషం ఒకవైపు.. అధ్యాత్మికతను మరోవైపు పెట్టి.. ఏం తీసుకుంటారని అడిగితే.. అధ్యాత్మికతనే తీసుకుంటానని చెబుతున్న రజనీ మాటలు చూసినప్పుడు.. ఆయన పాలిటిక్స్ మీద ఎలాంటి ఆసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. పవర్ అంటే ఇష్టమంటూనే.. అది అధ్యాత్మికంగా చెప్పుకున్న రజనీ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/