పోసాని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ప్రస్తుతం ఎస్ వీబీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ ఎపిసోడ్ లో తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకోవటమే కాదు.. తన మాటల్ని తప్పు పట్టిన పోసానికి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ఆందోళనలపై తాను చేసిన విమర్శలన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో చేసినవంటూ పోసాని మిస్ అయిన పాయింట్ ను చెప్పుకొచ్చారు.
అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారంటూ పృథ్వీ విమర్శలు చేయటం.. దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన పోసాని తప్పు పట్టటం తెలిసిందే. ఒకే పార్టీకి చెందిన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు అందరి చూపులు వారి మాటల మీద పడేలా చేస్తున్నాయి.
అమరావతిలో ఆందోళనలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని.. రైతులే అయితే ఆడి కార్లలో రావటం.. ఆందోళనల్లో పాల్గొన్న మహిళల చేతులకు బంగారు గాజులు ఉండటాన్ని పృథ్వీ తప్పు పట్టారు. దీనిపై పోసాని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రైతులైతే ఆడి కార్లు ఉండవా? బంగారు గాజులు ఉండవా? అంటూ తప్పు పట్టారు. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన పృథ్వీ మాట్లాడుతూ.. తాను ఎవరికీ సారీ చెప్పనని.. సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రైతుల్ని తాను అవమానపర్చలేదన్న ఆయన.. తాను చేసిన వ్యాఖ్యలన్ని బినామీ రైతులను ఉద్దేశించి మాత్రమేనని చెప్పారు.
రైతులంటే తనకు గౌరవమని.. అమరావతిలో బినామీ రైతులు మీకు కనిపించటం లేదా? అంటూ పోసానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? అన్నది పోసాని ప్రశ్న అయితే.. తాను చేసిన వ్యాఖ్యలన్ని బినామీ రైతులను ఉద్దేశించే తప్పించి.. రైతుల్నికాదన్న పృథ్వీ పాయింట్ చూస్తే.. పోసాని మాష్టారు ఎక్కడో డిస్ కనెక్ట్ అయినట్లుగా కనిపించకమానదు. తాను చేసిన వ్యాఖ్యలపై పృథ్వీకి ఉన్నంత క్లారిటీ పోసానిలో మిస్ అయ్యిందని.. అదే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.