తీవ్ర ఆరోపణలు రావడం.. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఇష్టం లేకుండానే ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి నటుడు పృథ్వీరాజ్ రాజీనామా చేసి తప్పుకున్నాడు. అప్పటి నుంచి పెద్దగా ఎక్కడా కనిపించని పృథ్వీరాజ్ రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా తిరుమలకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆ సమయంలో జరిగిన పలు విషయాలను వెల్లడించాడు. తాను పదవిని కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పదవి నుంచి దూరమైనప్పటి నుంచి తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని సినీ నటుడు తెలిపాడు. కుట్రపూరితంగానే తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎస్వీబీసీ నుంచి పంపి కొందరు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. అయితే తనపై ఎందుకు కుట్ర పన్నారో వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తాను హామీ ఇవ్వడంతోనే తనపై కుట్ర పన్నారని పేర్కొన్నారు. తన చుట్టూ ఉండే వారే వెన్నుపోటు పొడిచారని కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జల - వైవీ - విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని తెలిపారు.
అయితే తాను ఎప్పుడూ రాజధాని రైతులను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. తాను ఏ సామాజిక వర్గాన్నీ టార్గెట్ చేయలేదని.. అది దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.