ఏపీ అధికార పార్టీ వైసీపీ తరఫున గత ఎన్నికల్లో ప్రచారం చేసిన కాపు సామాజికవర్గానికి చెందిన క్యారెక్టర్ నటుడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. పృథ్వీరాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఆయన 'అమ్మనా బత్తాయ్' కామెంట్‌తో ఎక్కువగా పాపులర్ అయ్యారు.
వైసీపీకి, సీఎం జగన్‌కు గతంలో ఎంతో ఆత్మీయ వ్యక్తిగా ఉన్న ఆయనను ప్రభుత్వం ఏర్పడగానే ఎస్వీబీసీ చానెల్‌కు చైర్మన్‌గా చేశారు. తర్వాత లైంగిక ఆరోపణలు వచ్చాయంటూ..(కాదని పృథ్వీ అంటాడు) ఆయనను పక్కన పెట్టారు.
వైసీపీకి, జగన్‌కుఎంతో విదేయుడు అయిన పృథ్వీ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని తీవ్ర హాట్ కామెంట్ చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే పాలన పూర్తిగా గాడి తప్పిందని.. తనదైన శైలిలో వ్యాఖ్యానించి సెగ పుట్టించాడు. తాజాగా ఆయన కడప దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ పేరు ఎత్తకుండా ప్రభుత్వంపై మాత్రం కత్తిలాంటి కామెంట్లు చేశాడు.
"వైసీపీ అవలంభిస్తున్న కొన్ని పద్ధతులు నాకు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చా" అని పృథ్వీ తెలిపాడు. తాను పార్టీలో ఉన్నంతవరకు పార్టీ కోసం కష్టపడ్డానని, అయితే.. తనను కొన్ని శక్తులు బలవంతంగా బయటకు పంపించాయని అన్నాడు.
ప్రజలు వైసీపీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై గతంలో ఎటువంటి ఆరోపణలు రాలేదని, మరోసారి ప్రమాణం చేయమన్నా చేస్తానని చెప్పాడు. వైసీపీ విధానాలు నచ్చకే తాను పార్టీలో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపాడు. మొత్తానికి అమ్మనా బత్తాయ్ కామెంట్లపై అధికార నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.