వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో గట్టిగా వాయిస్ వినిపించి.. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని మెప్పించి కమెడియన్ పృథ్వీ సంపాదించుకున్న ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవి ఆరు నెలలైనా నిలవలేదు. అనూహ్య పరిస్థితుల్లో పృథ్వీ ఆదివారం ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి కారణం టీటీడీలో ఓ కింది స్థాయి ఉద్యోగితో పృథ్వీ జరిపినట్లుగా సరస సంభాషణల తాలూకు ఆడియో లీక్ కావడమే. నిన్న సాయంత్రం నుంచి ఈ ఆడియో సోషల్ మీడియాను హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీ తన రాజీనామాను ప్రకటించారు. ఈ ఉదయం ఆడియో వ్యవహారం టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి వద్దకు చేరింది. జగన్‌తో సంప్రదించిన అనంతరం ఆయన పృథ్వీని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
‘నిన్ను వెనుక నుంచి వాటేసుకుందాం అనుకున్నా.. కానీ నువ్వు కెవ్వుమని అరుస్తావేమో అని ఆగిపోయా’’.. ‘ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం’’.. ‘‘మీ ఇంటికి వద్దామనుకున్నా’’.. ‘‘నేను మందు కొట్టడం మానేశా. నీ ముందు తాగాలని ఉంది. ఇద్దరం కలిసి తాగుదాం’’.. ఇలా ఆ ఆడియోలో గుర్తు తెలియని మహిళతో మాట్లాడుతూ చాలా కామెంట్లే చేశాడు పృథ్వీ. పృథ్వీ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ ఆయనతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూనే ఇదంతా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో పెద్ద స్థాయిలోనే దుమారం రేపింది. గత కొన్ని నెలల్లో వైరి పార్టీలపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీ టార్గెట్‌గా మారాడు. ఇలాంటి సమయంలో ఈ వీడియో బయటికి రావడంతో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆల్రెడీ పోసానితో గొడవ కారణంగా జగన్ హెచ్చరికలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆడియో వ్యవహారం కూడా తోడై రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చింది.