వివిధ కార్పొరేట్ కంపెనీలు - వ్యాపారస్తులు - ఇతర రుణ గ్రహీతలు కేవలం మూడేళ్లలోనే 29 ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొత్తంగా రూ.1.14 లక్షల కోట్లు టోపీ పెట్టారట. 2013-2015 ఆర్ధిక సంవత్సరాల్లో ఈ మొత్తం మొండి బాకీలుగా మిగిలి బ్యాంకులకు భారమవుతున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయగా రిజర్వు బ్యాంకు నుంచి ఈ మేరకు సమాధానం వచ్చింది.
గత ఐదేళ్లలో కేవలం స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్ర - స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండోర్ లు మాత్రమే మొండి బాకీలు లేకుండా అత్యంత ప్రగతిని కనబర్చాయి. 2013 మార్చితో పోల్చితే 2015 మార్చి ముగింపు నాటికి ఇతర పిఎస్ బిల మొండి బాకీలు ఏకంగా 85 శాతం పెరిగాయి.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బిఐలో 2013 నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. అప్పుడు రూ.5,594 కోట్ల మొండి బాకీలుండగా 2015 నాటికి ఇవి 21,313 కోట్లకు ఎగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తంగా 7 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు, మొండి బాకీలు, పునరుద్దరణ రుణాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని ఈ మధ్య కాలంలో ఆర్ బిఐ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. 2015 జూన్ నాటికి పిఎస్ బిల్లో మొండి బాకీలు 6.03 శాతానికి ఎగిశాయి. 2015 మార్చి నాటికి ఇవి 5.20 శాతంగా ఉన్నాయి. కేవలం మూడు మాసాల్లోనే భారీగా నిరర్ధక ఆస్తులు పెరగడం దేశ ఆర్ధిక వ్యవస్థలోని లోటుపాట్లను బయటపెడుతోంది.
2015లో టాప్ 10 బ్యాంకుల్లో మొండిబకాయిలు(రూ.కోట్లలో)..
ఎస్ బిఐ.. 21,313
పిఎన్ బి 6,587
ఐఒబి 2,109
ఐడిబిఐ బ్యాంకు 1,609
బిఒబి 1564
సిండికేట్ బ్యాంకు 1,527
కెనరా బ్యాంకు 1,472
యూకో బ్యాంకు 1,401
సెంట్రల్ బ్యాంకు 1,386
మూడేళ్లలో ఎన్ పిఎలు..
ఎస్ బిఐ 40,084
పిఎన్ బి 9,531
ఐఒబి 6,247
బిఒబి 4,884
కెనరా బ్యాంకు 4,598
సెంట్రల్ బ్యాంకు 4,442
అలహాబాద్ బ్యాంకు 4,243
సిండికేట్ బ్యాంకు 3,849
ఒబిసి 3,593