ఏపీలో సైకో భర్తలు.. వేధించడంలో నంబర్ 1

Update: 2022-05-28 01:30 GMT
జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే సంచలన విషయాలను వెల్లడిస్తూ అందరినీ షాకింగ్ కు గురిచేసింది. ఇప్పటికే వ్యాధులు, ఆహారం, శృంగారం, ఇతర విషయాల్లో ఈ సర్వే రిపోర్టులు తెలుగు నాట చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఏపీలో మరో ఆశ్చర్యకర విషయం బయటపడింది.

ఆంధ్రప్రదేశ్ లో 18-49 ఏళ్ల వయసున్న పెళ్లైన మహిళల్లో 35 శాతం మంది శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్5) వెల్లడించింది. ఏపీలో 18-49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 34శాతం మంది శారీరక హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దాంతోపాటు 3శాతం మంది లైంగిక హింసను ప్రతిరోజు అనుభవిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ బాధకరమైన అంశం ఒకటుంది.

ఇలా హింసను ఎదుర్కొంటున్న 18-49 సంవత్సరాల వయసుగల స్త్రీలలో 4శాతం మంది గర్భవతులు అని తేలింది. ఇలా గర్భవతిగా ఉన్న సమయంలోనూ హింసను ఎదుర్కొంటున్న వారిలో చదువుకున్న మహిళలు 12శాతం, 3-4  వయసు గల పిల్లలున్న మహిళలు 6శాతం , వితంతులు విడాకులు తీసుకున్న వారు.. విడిపోయిన లేదా విడిచిపెట్టిన మహిళలు 8శాతం, గర్భాధారణ సమయంలో హింసను ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

ఇక ఏపీలో 18-49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహిత మహిళల్లో 30శాతం మంది తమ భర్త వలన శారీరక హింసను అనుభవిస్తున్నారు. 4శాతం మంది తమ భర్త చేసిన లైంగిక హింసను భరిస్తున్నారట.. 15శాతం మంది మానసికంగా హింసను ఎదుర్కొంటున్నారు. 27శాతం వివాహిత మహిళలు తమ భర్తలతో చెప్పుతో కొట్టబడ్డారని సర్వేలో వెల్లడైంది.

11శాతం మంది తమపైకి నెట్టబడడం లేదా విసిరి కొట్టడం.. తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది. 8శాతం మంది తమ చేతిని మెలితిప్ప పిడికిలితో లేదా వారికి హాని కలిగించే వాటితో కొట్టడం వంటివి ఎదుర్కొంటున్నారని తేలింది.

ఇక 18-49 ఏళ్ల వయసున్న పెళ్లయిన మహిళల్లో మూడు శాతం మంది తమ భర్తలు తమకు ఇష్టం లేకపోయినా శారీరకంగా బలవంతం చేశారని.. 2 శాతం మంది తమ భర్తలు బెదిరింపులతో లేదా మరేదైనా లైంగిక చర్యలకు పాల్పడ్డారని నివేదించారు. మొత్తం మీద 30శాతం మంది పెళ్లయిన స్త్రీలు వారి భర్త నుంచి శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నట్లు సర్వేలో తేలింది.
Tags:    

Similar News