ఏ క‌ల వ‌స్తే ఏం జ‌రుగుతుందంటే..?

Update: 2018-03-13 23:30 GMT
నిద్ర‌లో క‌ల‌లు రావ‌టం కామ‌న్. కానీ.. వ‌చ్చే క‌ల వెనుక లోతైన అర్థాలు ఉంటాయి. వ‌చ్చిన ప్ర‌తి క‌ల‌ను గుర్తు చేసుకొని.. వాటిని విశ్లేషిస్తే.. మ‌న‌లో మ‌న‌కు దాగి ఉన్న ఎమోష‌న్స్ తెలియ‌ట‌మే కాదు.. మ‌న మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయి. క‌ల‌ల‌కు సంబంధించి నిపుణులు చెప్పే సూచ‌న‌లు.. త‌ర‌చూ వ‌చ్చే క‌ల‌ల‌కు అర్థాలు ఏమిట‌న్న‌ది చూస్తే.. క‌ల‌ల మీద కొత్త దృక్ఫ‌ధం ఏర్ప‌డ‌టం ఖాయం.

క‌ల‌లు చెప్పే వాస్త‌వాలు ఏమిటంటే..

పెద్ద పెద్ద పాము క‌ల్లోకి వ‌స్తే?:  అభ‌ద్ర‌తా భావంతో ఉన్న‌ట్లు

గాల్లో ఎగిరిన‌ట్లు:  ఆకాశంలో ఎగురుతున్న‌ట్లుగా క‌ల వ‌చ్చిందంటే ల‌క్ష్యాన్ని చేరుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని.. లేదంటే జీవితంలో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకోనున్నార‌న్న‌ది అర్థం

న‌గ్నంగా ఉండ‌టం:  భ‌యానికి.. అభ‌ద్ర‌తాభావానికి సూచ‌న‌

ఎవ‌రో త‌రుముతున్నారా?:  జీవితంలో ఎదుర‌య్యే క‌ష్టాలు.. స‌మ‌స్య‌ల గురించి భ‌య‌ప‌డుతున్న‌ట్లే. భ‌యాల్ని.. స‌మ‌స్య‌ల్ని ఎదిరించేందుకు రెఢీ కావాలి

చ‌నిపోయిన‌ట్లు క‌ల వ‌చ్చిందా?:  మీ జీవితంలో ఒక బంధం ముగిసిపోతుంద‌న్న సూచ‌న‌. లేదంటే.. కీల‌క‌మైన అధ్యాయం ఏదో ముగుస్తున్న‌ట్లే

ఎత్తు నుంచి కింద‌కు ప‌డిపోయారా?:  ఏదో విష‌యం మీద ప‌ట్టు సాధించాల‌న్న మీ ప్ర‌య‌త్నానికి సూచ‌న‌

అక్ర‌మ సంబంధం: ఆణ‌గ‌దొక్కిన లైంగిక వాంఛ‌లు.. జీవిత‌భాగ‌స్వామితో సంతోషంగా లేక‌పోవ‌టం

ప్రెగెన్సీ వ‌చ్చిన‌ట్లుగా?:  గొప్ప మార్పు.. ఎదుగుద‌ల‌కు సూచ‌న‌

డ‌బ్బులు వ‌స్తున్న‌ట్లుగా:  మైండ్ సెట్ లో తేడా ఉన్న‌ట్లే. డ‌బ్బు మీద ఆశ ఎక్కువ అవుతున్న‌ట్లే

మంట‌లు వ‌చ్చాయా?:  ఏదో మార్పు రానున్న‌ట్లే.
Tags:    

Similar News