మంత్రి మేరుగను ఆపి మరీ.. జగన్ పాలన ఏమిటో చెప్పేసిన బాధితులు

Update: 2022-09-23 04:21 GMT
ప్రభుత్వం ఏదైనా కానీ.. శ్రుతిమించి రాగాన పడేలా.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే.. ఊరుకోరు. శాంతిభద్రతలు కట్టుతప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసుల తీరు సరిగా లేదంటూ పబ్లిక్ గా ఫిర్యాదు చేస్తే.. జనం కోసమైనా.. ఏంటి సీఐగారు.. పరిస్థితేంటి? అని అడిగి.. న్యాయం చేయాలంటారు మాట వరసకు.

కానీ.. ఇలాంటివేవీ ఏపీలో కనిపించని పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని.. కొట్టేస్తున్నారన్న ఫిర్యాదులు వైసీపీ నేతలకే అందుతున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జగన్ సర్కారు నిర్వహిస్తున్న 'గడప గడపకు మన ప్రభుత్వం'లో భాగంగా ప్రజల వద్దకే నేరుగా వైసీపీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న పర్యటనల్లో ఇప్పటికే పాలనకు సంబంధించిన లోపాల్ని పలువురు ప్రస్తావిస్తూ కడిగేస్తున్న పరిస్థితి. కొందరు నేతలకు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాట దాటేస్తూ వెళ్లిపోతున్నారు.

ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున తాజాగా వేమూరు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దవాళ్లు మంత్రి ముందుకు ఒక షాకింగ్ ఇష్యూను తీసుకొచ్చారు. ''వైసీపీకి చెందిన స్థానిక నాయకులు మా బిడ్డలపై దాడులు చేయిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తే కనీసం విచారించకుండా పక్కన పడేస్తున్నారు. మీరైనా మాకు న్యాయం చేయండి'' అంటూ మంత్రి వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు.

ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి పక్కనున్న పోలీసు అధికారులతో.. న్యాయం చేయాలని చెప్పటం చూస్తుంటాం. కానీ.. మేరుగ మాత్రం రోటీన్ కు  భిన్నంగా స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పేర్కొంటూ వెల్లిపోయారు. దీంతో.. బాధితులు అవాక్కు అయ్యారు.

మంత్రిగారికి తమ సమస్యల్ని చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని కొండంత ఆశ పెట్టుకున్న దానికి బదులుగా స్పందించటం.. తన దారిన తాను వెళ్లిపోవటంపై అవాక్కు అయ్యే పరిస్థితి. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల్ని లబ్థిదారులకు చెప్పటమే తప్పించి.. వారి సమస్యల్ని పరిష్కరించే ఆలోచన మంత్రికి లేకపోతే ఎలా అంటూ వారు వాపోతున్నారు. మేరుగ మజాకానా? అన్నట్లుగా ఆయన రియాక్షన్ ఉందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News