ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అదేసమయంలో ఓటర్ల తీరు కూడా మారుతోంది. ఎప్పుడూ ఒకేలా ఆలోచిం చే పరిస్థితి ఏపీ ఓటర్లలో కనిపించడం లేదు. దీనికి కారణం.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పాలనేనని అంటున్నారు పరిశీలకు లు. గతంలో ఎవరికీ రాని మెజారిటీ.. 2019 ఎన్నికల్లో వైసీపీకి లభించింది. ఏకంగా 50 శాతం ఓట్లు వైసీపీ వచ్చాయి. నిజానికి ఇది పెద్ద రికార్డే. అదేసమయంలో జగన్ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు లభించాయి. 22 ఎంపీ సీట్లు దక్కాయి. అయితే.. ఇంత భారీ ఓటు బ్యాంకు.. ఇన్ని సీట్ల వెనుక ఉన్నదంతా.. జగనే! ఆయనను చూసే.. ప్రజలు ఓట్లేశారు. ఆయన చేసిన పాదయాత్ర కావొచ్చు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని వైఎస్ కుటుంబం మొత్తం రోడ్డెక్కి అభ్యర్థించడం కావొచ్చు. ఏదేమైనా.. వైఎస్ జగన్‌కి భారీ మెజారిటీ కట్టబెట్టారు.
ఇక్కడ మరో విషయం చర్చించుకోవాలి. అదేంటంటే..అప్పటి ప్రభుత్వ సారథి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యతిరేకత కంటే కూడా.. జగన్‌ను ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా చూడాలనే అభిమానులు పెరగడం, ప్రజల్లోనూ తన తండ్రి వైఎస్ మాదిరిగా.. పాలన అందిస్తాడనే భావన రావడంతోపాటు.. జగన్ కూడా ఎక్కడ మైకు పట్టుకున్నా.. ``రాజన్న రాజ్యం తెస్తా`` అనే హామీ ఇవ్వడంతో టీడీపీకి పడాల్సిన కమ్మ, బీసీ సామాజిక వర్గాల ఓట్లు వైసీపీకి గంపగుత్తగా పడ్డాయి. దాదాపు వీరి ఓట్లు 40 శాతం వరకు వైసీపీకి మళ్లాయనే ఒక అంచనా ఉంది. ఉదాహరణకు కమ్మ సామాజికవ ర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణాల్లో ఇదే తరహా ఫలితం వైసీపీకి కనిపించింది.
అదేసమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పడాల్సిన కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపు 55 శాతం వరకు వైసీపీకి పడ్డాయి. ఇది భారీ ఎత్తున వైసీపీకి లాభించింది. అదేసమయంలో టీడీపీకి 40 శాతం ఓట్లు పడినా కూడా.. కేవలం 23 మంది ఎమ్మెల్యేలకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. అదేవిధంగా ముగ్గురు ఎంపీలతోనే సరిపుచ్చుకుంది. ఈ ప్రజా తీర్పుతో టీడీపీకి సౌండ్ లేకుండా పోయింది. ఇది..గత 2019 నాటి ఏపీ రాజకీయ చిత్రం. అయితే.. రోజులు గడిచే కొద్దీ.. జగనన్న పాలన ఏమిటో.. ప్రజలకు స్పష్టమైపోయింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచేసరికి.. ఈ కాలంలో రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా.. సంక్షేమ పథకాలపైనే జగన్ దృష్టి పెట్టారు. వాటిపైనే ఆయన ఆధారపడుతున్నారు.
గెలవకముందు ఉన్నంత క్రేజ్.. గెలిచిన తర్వాత.. ఉండదు.. అన్నట్టు.. ఇప్పుడు.. ఎక్కడ చూసినా.. వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు కూడా గుర్తించారు. అయితే.. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏమీ పుంజుకోలేదు. కానీ.. లాజిక్‌గా చూసుకుంటే.. 2009 ఎన్నికలకు ముందు.. 2004-2009 మధ్య వైఎస్ హయాంలో అనుసరించిన విధానం వేరు. ఆయన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టినా..వాటిని ఎమ్మెల్యేలకు, ప్రజలకు, పార్టీ వారికి కూడా అందేలా.. చూసుకున్నారు. అయినప్పటికీ.. 2009 ఎన్నికల్లో మాత్రం.. వైఎస్ రెండో సారి బొటాబొటి మెజారిటీతోనే విజయం దక్కించుకున్నారు.
అది కూడా తక్కువ మార్జిన్(25-30) సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అది కూడా అప్పట్లో ప్రతిపక్షాలు చీలిపోవడం.. లోక్‌సత్తా వంటి పార్టీ.. హైదరాబాద్, వైజాగ్ వంటి అర్బన్ ప్రాంతాల్లో టీడీపీ ఓట్లు చీల్చితే.. అప్పట్లో పార్టీ పెట్టిన చిరంజీవి.. పార్టీ.. ప్రజారాజ్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ ఓట్లను చీల్చింది. ఇంత జరిగితే.. తప్ప వైఎస్ రెండో సారి అధికారంలోకి రాలేక పోయారు. అలాంటప్పుడు.. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏం జరుగుతుందో అంచనా వేయొచ్చు. ఎలా అంటే.. వ్యక్తిని చూసి ఓట్లేసేది ఒకే ఒక్కసారి మాత్రమే. తర్వాత.. ఆయన పాలనను చూసే ఎవరైనా మొగ్గు చూపుతారు. డిల్లీలోను, పశ్చిమ బెంగాల్‌లోనూ.. జరిగింది ఇదే. అక్కడి కేజ్రీవాల్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలు.. అభివృద్ధి వంటివాటిని చూసి ప్రజలు రెండోసారి ఆయన వైపు మొగ్గు చూపారు.
మరి ఏపీని చూస్తే.. జగన్ అధికారంలోకి వచ్చి.. రెండున్నరేళ్లు అయినా.. ఆయన అభివృద్ధి చేయలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సో.. దీనిని బట్టి.. జగన్‌ను చూసి.. ఓట్లు రాలే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం.. అభివృద్ధి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, .. ఎంపీల పనితీరు వంటివే.. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా వర్కవుట్ అవుతాయని విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా.. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే.. గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. లేకపోతే.. కష్టమే అంటున్నారు.. అయితే.. వైసీపీ నాయకులు ఎక్కడ మైకు పట్టుకున్నా.. లోకల్ ఎన్నినకలలో గెలిచాము అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ.. వాస్తవానికి వాటిని పరిశీలిస్తే.. లోకల్ ఎన్నికలు ఎప్పుడూ.. ఎన్నికలు కావు. అవి సెలక్షన్లు మాత్రమే. ప్రభుత్వం ఎవరిదైతే.. ఆ పార్టీ నాయకులే స్థానికంలో గెలుపు గుర్రం ఎక్కుతారు. సో.. ఇది వాపు మాత్రమే! బలుపు ఎంత మాత్రం కాదు. దీనిని బట్టి.. వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకుంటేనే.. ప్రజల్లో మార్కులు సంపాయించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.