ఏంటి..? మా బాబుకే సవాల్ విసురుతున్నారా? ప్రోగ్రామ్ ఏదైనా సరే.. దిమ్మ తిరిగిపోయేలా చేయటం మా బాబుకే సాధ్యమంటూ సమాధానాలు ఇచ్చేస్తుంటారు బాబు అనుచర వర్గం. ఎప్పటిలా ఈసారి మాత్రం అలాంటి బడాయి మాటలు మాట్లాడితే బాబుకే ఇబ్బంది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కూడా చేస్తారా? ఇంత కమిట్ మెంట్ తో చేయగలరా? అనిపించేలా మురికి కాలువను క్లీన్ చేసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వచ్ఛ భారత్ అంటూ ప్రధాని నుంచి గల్లీ లీడర్లే కాదు.. బోలెడంత మంది సెలబ్రిటీలు.. పారిశ్రామిక ప్రముఖులు చాలానే చేశారు కానీ ఈ ముఖ్యమంత్రి మాదిరి మాత్రం ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు.
ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి కాసింత లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తుంటారు. పాత కాలానికి చెందిన ఈ కాంగ్రెస్ సీనియర్ నేత.. స్వచ్ఛ భారత్ లో భాగంగా మురికి కాలువను క్లీన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం మురికి కాలువ క్లీన్ చేయటం అంటే.. మహా అయితే ఫోటోలకు ఫోజులకే ఎక్కువ ప్రాధాన్యత తప్పించి పని చేసేది తక్కువగా భావిస్తారు.
అలాంటి ఆలోచనలతో వచ్చిన వారికి షాకివ్వటమే కాదు.. పార్టీ నేతలు ముక్కున వేలేసుకునేలా చేశారు. ఇక.. ఉన్నతాధికారులకైతే భారీ షాక్ తగిలినంత పనైందని చెబుతున్నారు. ఎందుకంటే.. చేతికి గ్లౌజ్ లు వేసుకొని.. పార పట్టుకొని లోతులో ఉన్న మురికి కాలువలోకి దిగటమే కాదు.. ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా సీరియస్ గా కంపు కొడుతున్న డ్రైనేజీలోని మురుగును తీయటం.. అలా ఒకట్రెండు పారలు కాకుండా.. నాలుగైదు పారలకు మించే తీసేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇలాంటి ప్రోగ్రామ్ కానీ బాబు చేస్తే.. ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి.. భారీగా హడావుడి చేయటానికే తప్పించి మరింకేమీ ఉండదు. అందుకు భిన్నంగా నిజాయితీగా మురుగు తీసిన నారాయణస్వామి తీరు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుతోంది. ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. సీఎం బాబు ఈ సీఎంతో పోటీ పడగలరా? నారాయణస్వామి కమిట్ మెంట్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరే ఏదో ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కోసం ఈ పని చేస్తున్నట్లు లేదు.. నిజాయితీగా మురికి కాలువలోకి దిగి చెత్తను తొలిగిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నిజాయితీగా పని చేస్తే పొగడని వారెవరు ఉంటారు చెప్పండి.
వీడియో కోసం క్లిక్ చేయండి