ఆ సీఎం ఉప ఎన్నికల్లో గెలిచారు

Update: 2016-11-22 07:45 GMT
ఒక ముఖ్యమంత్రి తనకు తానుగా ఉప ఎన్నికల బరిలోకి దిగితే.. ఆఎన్నిక ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు. తాజాగా అలాంటిదే పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వీ నారాయణస్వామి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. నెల్లితొప్పే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. తన సమీప అభ్యర్థిపై స్వల్ప అధిక్యంతో విజయం సాధించారు.

ఆ మధ్య జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో నారాయణస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంసాధిస్తుందన్న నమ్మకంఏ మాత్రం లేదు. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో ముఖ్యమంత్రిగా నారాయణ స్వామికి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన ఎమ్మెల్యే కాకపోవటంతో..సీఎం పదవిని చేపట్టిన ఆరునెలల వ్యవధిలోనే ఆయన ఎమ్మెల్యేగాఎంపిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఉఫ ఎన్నికల బరిలోకి దిగారు.

ముఖ్యమంత్రే ఉప ఎన్నికల అభ్యర్థిగా బరిలోకి దిగటంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయనకు పోటీగా తమిళనాడు అధికారపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తిశేఖర్ గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఈ ఉప ఎన్నిక హోరాహోరీ సాగింది. చివరకు ముఖ్యమంత్రిని విజయం వరించినా.. ఉప ఎన్నికల్లో  ఆయన సాధించిన మెజార్టీ కేవలం 11,151 ఓట్లే కావటం గమనార్హం.

ఈ ఉప ఎన్నిక తోపాటు.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. నాలుగు లోక్ సభా స్థానాలకు.. ఎనిమిది అసెంబ్లీస్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో  త్రిపురలో బర్జాలా అసెంబ్లీ స్థానాన్ని సీఫీఎం కైవశం చేసుకోగా.. మరో సీపీఎం ఎమ్మెల్యే మృతితో నిర్వహించిన కోవాయి అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం సొంతం చేసుకుంది.

ఇక.. అసోంలోని లఖీంపుర లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేజీ ముందంజలోఉంది. మధ్యప్రదేశ్ లోని షాదోల్ లోక్ సభ స్థానంలోనూ.. నేప నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News