ఏపీలో హాట్ సీటు ఏది అంటే కడప జిల్లా పులివెందుల అని చెబుతారు. ఈ సీటు దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్సార్ ఫ్యామిలీకే దత్తతకు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి విపక్షాలు ఎన్నిసార్లు పోటీ చేసినా విజయం మాత్రం వైఎస్సార్ ఫ్యామిలీనే వరిస్తోంది అని చెప్పక తప్పదు. అంతలా ఈ సీట్లో పాతుకుపోయిన వైఎస్సార్ కుటుంబాన్ని ఓడించడం కష్టమే కానీ ఎప్పకపుడు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో కొత్త రకమైన స్ట్రాటజీస్ తో ప్రత్యర్ధి పార్టీలు ముందుకు వస్తూంటాయి.
ఇపుడు అంటే 2024 ఎన్నికల్లో చూస్తే కుప్పంలో చంద్రబాబునే ఓడిస్తామని పంతం పడుతున్న జగన్ విషయంలో టీడీపీ కూడా అంతే పంతం మీద ఉంది అంటున్నారు. ఆయన పులివెందులలో కూడా టెన్షన్ పుట్టిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కుప్పంలో బాబుని ఓడించడం కాదు ముందు పులివెందుల సంగతి చూడండి అని అంటున్నారు. ఇక పోతే ఏపీలో జనసేన టీడీపీ పొత్తులు ఖాయమనే అంటున్నారు.
మరొ పొత్తుల ఎత్తులలో భాగంగా రెండు పార్టీలు ఎన్ని రకాలైన వ్యూహాలతో ముందుకు వస్తాయో అని కూడా చర్చ సాగుతోంది. ఇక ఉమ్మడి ప్రత్యర్ధి అయిన జగన్ సొంత ఇలాకా పులివెందులలో పోటీకి కూడా ఈ రెండు పార్టీలు రెడీ అవుతున్నాయని అంటున్నారు. చూడబోతే పులివెందులలో ఎపుడూ టీడీపీ పోటీ చేస్తూ ఓడుతోంది. ఆ పార్టీ కూడా ఎపుడూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధినే పోటీలో నిలుపుతోంది. అయితే ఈసారి మాత్రం జగన్ కి సామాజికవర్గ కోణంతో పాటు సరికొత్త రాజకీయ సమీకరణలతో బిగ్ ట్రబుల్స్ ఫేస్ చేసేలా చేయడానికి చంద్రబాబు పవన్ సరికొత్త రాజకీయ తంత్రంతో ముందుకు వస్తారని అంటున్నారు.
ఆ విధంగా చూస్తే కనుక పులివెందులను ఈసారి జనసేనకు కేటాయించి పూర్తి మద్దతును టీడీపీ ఇచ్చేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని అంటున్నారు. పులివెందులలో బలిజలు, మైనారిటీలు ఎక్కువ. దీంతో ఎపుడూ రెడ్డిలకే పట్టం కడుతున్న ఈ సీట్లో బలిజల నుంచి అభ్యర్ధిని నిలిపితే ఎలా ఉంటుంది అన్నదే కీలకమైన చర్చగా ముందుకు వస్తోంది. జనసేనకు ఎటూ బలిజల మద్దతు ఉంటుంది కాబట్టి ఆ పార్టీకే పులివెందుల టికెట్ పొత్తులో భాగంగా ఇచ్చేసి బలిజలను ముందుకు ఎగదోస్తే అపుడు పులివెందుల రాజకీయం రసకందాయంలో పడుతుంది అని టీడీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారుట.
అదే కనుక జరిగితే జగన్ ఎటూ ఓడిపోరు కానీ గతంలో వచ్చిన ఎనభై వేల ఓట్ల మెజారిటీ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. అంతే కాదు జగన్ సొంత ఇలాకాలో పొలిటికల్ టెన్షన్ క్రియేట్ చేయడానికి కూడా ఈ విధంగా చూస్తే ఆయన మొత్తం ఏపీ ఫోకస్ ని కూడా ఈ వైపుగా మళ్ళించవచ్చు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే గతం కంటే కూడా పులివెందులలో వైసీపీకి కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. పులివెందులలో అన్నీ తాను అయి చూసుకునే సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కావించడబడడంతో కుడి భుజమే పులివెందులలో వైసీపీకి లేకుండా పోయింది అంటున్నారు.
ఇక ఆయన దారుణ హత్య వెనక ఉన్న అనుమానాలు ఆరోపణలు అన్నీ చూసినా కూడా అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అయ్యేలాగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ వివేకా కేసు కనుక కొలిక్కి వచ్చి అసలు దోషులు ఎవరో బయటపడితే అధికార పార్టీకి చెందిన వారు ఎవరైనా అందులో ఉంటే కనుక అది చాలా పెద్ద ఎత్తున పులివెందుల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే కనుక టీడీపీ జనసేన కలసికట్టుగా సామాజిక సమీకరణలను సెట్ చేసి మరీ క్యాండిడేట్ ని పెడితే అన్నీ కలసి పులివెందులలో వైసీపీకి పొగలూ సెగలు తప్పకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి టెన్షన్ పెట్టే పనిలో చంద్రబాబు ఇపుడు బిజీగా ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.