జమ్మూలో గత నెల 14న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా జిల్లాలోని అవంతిపురలో జరిగిన ఈ ఆత్మహుతి దాడి జైషె ఏ అహ్మద్ పనేనని ఆ ముఠా నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ పేర్కొంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల తరువాత పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది..
అయితే అప్పటి నుంచి ఉగ్రవాదులు - భారత జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కాశ్మీర్‌లోని త్రాల్ జిల్లాలోని పింగ్లీష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వీరంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారేనని గుర్తించారు. ఆ తరువాత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగానే పోరు సాగింది.
అయితే ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ముఠా సంస్థకు చెందిన ముఖ్య నేత హతమైనట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి సూత్రధారి అయిన ముదాసిర్ అహ్మద్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి సమయంలో అహ్మద్ ఖాన్ గురించి అనేక విషయాలు బయటికి వచ్చాయి. ఈ దాడికి ముందు ఆత్మాహుతికి పాల్పడిన అదిల్ అహ్మద్‌కు బాంబులు - ఇతర పేలుడు పదార్థాలను అందించింది ముదాసిర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతో ముదాసిర్ ఏ ప్రాంతానికి చెందిన వాడనే దానిపై భద్రతా దళాలు శోధన మొదలుపెట్టాయి. . ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం త్రాల్ జిల్లాలోని మీర్ మొహల్లా ప్రాంతానికి చెందిన ముదాసిర్ డిగ్రీ పూర్తి చేసి ఐటీఐలో ఎలక్ట్రికల్ కోర్సులో చేరాడు. తీవ్రవాదం పట్ల ఆసక్తి కనబరిచి 2017లో జైసే మహ్మద్ ముఠాలో చేరాడు. ఇప్పుడు అతడి ఆచూకీని కనిపెట్టి మరీ భద్రతాదళాలు హతమార్చి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి.