తెలంగాణ రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఏదైనా పరిణామం చోటు చేసుకున్నంతనే.. మీడియాతో మాట్లాడే బదులు.. సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టేస్తున్నారు. గతంలో కీలక వ్యాఖ్యలు చేసేందుకు మీడియాను పిలిపించి మాట్లాడేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎక్కడో ఉండి కూడా తాజా రాజకీయ పరిణామాల మీద తాను చెప్పాలనుకున్నది చెప్పేయటం.. క్షణాల్లో అందరికి రీచ్ అయ్యేలా ఉండటంతో సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నారు.
సోషల్ మీడియాలో తమ పొలిటికల్ కామెంట్లను పంచుకోవటం ద్వారా.. తాము చెప్పాలనుకున్నది చెప్పేయొచ్చు. మరెవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. మీడియాను పిలిచి వ్యాఖ్యలు చేస్తే.. దానికి మళ్లీ ప్రశ్నల్ని సంధిస్తుంటారు. దానికి సమాధానం చెప్పే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే.. సోషల్ మీడియాలో పోస్టుల విషయానికి వస్తే.. తాము చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పొచ్చు.
రాహుల్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో గులాబీ అన్నాచెల్లెళ్లు కేటీఆర్.. కవితలు ట్విటర్ వేదికగా చేసుకొని పంచ్ లు వేయటం తెలిసిందే. అయితే.. వీరిద్దరు సంధిస్తున్న ట్వీట్లకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్లు పడుతున్న సంగతి తెలిసిందే.
అయినప్పటికీ వెనక్కి తగ్గని మంత్రి కేటీఆర్.. రాహుల్ పర్యటనపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ‘పొలిటికల్ టూరిస్ట్ లు వస్తారు.. పోతారు కానీ కకేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారు’ అంటూ తన మార్క్ సెటైర్ సంధిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తగ్గట్లే తన మేనరిజం కళ్లకు కట్టే ఫోటోను పోస్టు చేశారు.
పంచ్ అదిరినా.. ఫోటో మాత్రం దెబ్బేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మితిమీరిన అహంకారం కానీ శ్రుతిమించిన ఆత్మవిశ్వాసాన్ని కానీ తెలంగాణ ప్రజలు అంతగా ఆమోదించరన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మర్చిపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రాజకీయం ఒక్క పార్టీ.. లేదంటే ఒక వ్యక్తి మాత్రమే చేయాలన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. రాజకీయం అన్నాక ప్రజల ముందుకు ఎవరికి వారు వచ్చి.. తాము ఏమేం చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేయాలి. తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు ఓటుతో తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాతీయ నేతలను ఉద్దేశించి.. మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఓకే అన్నట్లు ఉన్నా.. అందుకు వాడిన ఫోటో మాత్రం ఎంతమాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.