కరోనా మూలాలు కనుగొన్న మనోళ్లు

Update: 2020-04-15 02:30 GMT
కరోనా కారణంగా ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది. ఇప్పటికే 19 లక్షలమందికి వైరస్ సోకగా.. లక్షన్నర మంది దాకా చనిపోయారు. ఇంకా విదేశాల్లో వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఎక్కడి నుంచి ఈ వ్యాధి వచ్చిందనే దానిపై తీవ్ర పరిశోధనలు సాగుతున్నాయి.

కరోనా వైరస్ పై దేశంలోనూ పరిశోధనలు సాగుతున్నాయి. దేశంలోనే ప్రముఖ మైన ఫుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజాగా సంచలన పరిశోధనల ఫలితాన్ని వెల్లడించింది.

కరోనా చైనాలో వెలుగుచూసినప్పుడే ఫుణేలోని జాతీయ వైరాలజీ పరిశోధకులు వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్ లోనూ పరిశీలనలు జరిపారు. దేశంలోని వేర్వేరు రకాల గబ్బిలాల రక్త  - లాలజల శాంపిల్స్ ను సేకరించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ - హైకోర్టు భవనాలు - చిలుకూరు బాలాజీ టెంపుల్ - జనగామ, -మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించి తీసుకెళ్లి పరిశోధించారు.

కరోనా వైరస్ ఎలా ఉద్భవించింది? ఏ రూపంలో ఎలా వ్యాప్తి చెందిందానే దానిపై ఇన్నాళ్లుగా ఫుణేలోని జాతీయ ఇన్ స్టిట్యూట్ లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కరోనాపై ఇంకా తేలకున్నా నిఫా వైరస్ కు గబ్బిలాలే కారణమని పుణే శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. కేరళలో 2018లో వెలుగుచూసిన నిఫాకు కారకం గబ్బిలం అని తేల్చారు.

భారత్ లోని 12 రకాల గబ్బిలాల్లో 3 రకాలు డేంజర్ వైరస్ లను వ్యాప్తి చేస్తాయని తేల్చారు. ఈ 3 గబ్బిలాల్లో కరోనా వైరస్ మూలాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీటిని త్వరలోనే నిగ్గుతేలుస్తామని తెలిపారు. గబ్బిలాలు సగం తిని వదిలేసిన పండ్లు,ఇతర జంతువులు, పక్షులు తినడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చారు. కరోనా మన దేశంలో పుట్టుకపోవడంతో దాని మూలాలు మన గబ్బిలాల్లో పరిశోధిస్తున్నారు. ఒకవేళ కనుగొంటే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం మన శాస్త్రవేత్తలకు సులువు అవుతుంది.
Tags:    

Similar News