కరోనా బాధిత రాష్ట్రాల్లో చేరిన మరో రెండు రాష్ట్రాలు ..ఏవంటే ?

Update: 2020-03-10 07:30 GMT
కరోనా వైరస్ కొత్తగా మరో రెండు రాష్ట్రాలకి వ్యాప్తి చెందింది. ఇప్పటికే భారత్ లో కొన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు రాష్ట్రాలకి పాకింది. ప్రపంచాన్ని వణికించేస్తున్న ఈ మహమ్మారి తాజాగా బెంగుళూరు కి కూడా పాకినట్టు తెలుస్తుంది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ కరోనా బారిన పడ్డట్టు రాష్ట్ర మంత్రి కె. సుధాకర్ తెలిపారు. దీంతో కర్నాటకలో తొలి కరోనా కేసు నమోదైంది. బాధితుడు.. అమెరికా నుంచి తన భార్యతో పాటూ మార్చి1న బెంగళూరుకు వచ్చాడు. బెంగుళూరు కి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ , కొద్ది రోజుల తరువాత తనలో కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం తో అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించాడు. ఆ తరువాత అతనే స్వయంగా రాజీవ్ గాంధీ చెస్ట్ డిసీజ్ ఆసుపత్రి వైద్యులకు మార్చి 8న ఈ సమాచారాన్ని ఇచ్చాడు.

అలాగే , ఈ కరోనా వైరస్ తాజాగా పంజాబ్ రాష్ట్రానికి కూడా వ్యాపించింది. బాధిత వ్యక్తి కొన్ని రోజుల ముందే ఇటలీ పర్యటనకి వెళ్లి తిరిగొచ్చినట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. బాధితుడు మార్చి 4న ఇద్దరు కుటుంబ సభ్యులతో పాటూ ఇటలీ నుంచి అమృత్‌ సర్‌ కు తిరిగొచ్చారు. అతడిని పరీక్షించగా కరోనా సోకినట్టు వెల్లడైంది అని పంజాబ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. దీనితో భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 45 కి చేరుకోగా ...కరోనా బాధిత రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలు కూడా చేరుకున్నాయి.
Tags:    

Similar News