సంచలనం: ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల లీగల్ నోటీసులు

Update: 2021-01-03 04:31 GMT
బీజేపీ ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ వేదికగా రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు తమ చట్టాలతో రైతులు బాగుపడుతారంటూ బీజేపీ నేతలు - కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.  రైతుల ఆందోళన వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు కాకరేపుతున్నాయి.

ఈ క్రమంలోనే పంజాబ్ కు చెందిన రైతులు తాజాగా ముగ్గురు బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం సంచలనమైంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ - గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ - మరో నేత రామ్ మాధవ్ కు రైతులు నోటీసులు పంపారు.

ఈ ముగ్గురు బీజేపీ నేతలు తమ ఆందోళనలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని.. ఇందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.

ఇక తెలుగు వ్యక్తి - బీజేపీ జాతీయ నేత అయిన రాంమాధవ్ తన ట్విట్టర్లో రైతు నిరసనలను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని రైతులు ఈ నోటీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు కూడా ఇంటర్వ్యూల్లో ఇలాగే దారుణంగా వ్యవహరించారని రైతులు ఆరోపించారు.

కాగా రైతులకు  పంజాబ్ అప్ ఇన్ చార్జి రాఘవ్ చద్దా లీగల్ టీం మద్దతుగా నిలిచింది. రైతుల తరుఫున బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News