పంజాబ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపీగా ఉన్న ప్రముఖ హాస్య నటుడు భగవంత్ మాన్ ను పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎంపిక చేశారు. అధికారంలోకి వస్తూనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. భగవంత్ మాన్.
కాగా పంజాబ్ సీఎం తాజాగా డాక్టర్ గురుప్రీత్ కౌర్(32) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆయనకు రెండో వివాహం. పంజాబ్ ముఖ్యమంత్రిని పెళ్లాడటంతో దేశవ్యాప్తంగా గురుప్రీత్ కౌర్ ట్రెండింగ్ లో నిలిచారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ఫాలో కావడం ప్రారంభించారు. ఈ సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేయాల్సిన గురుప్రీత్ కౌర్ అనూహ్యంగా తన ట్విట్టర్ ఖాతాకు గుడ్ బై చెప్పారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఏకంగా పంజాబ్ ముఖ్యమంత్రిని పెళ్లాడటంతో గురుప్రీత్ కౌర్ అసలు ఎవరు, ఏంటి అనే వివరాల కోసం నెటిజన్లు భారీ స్థాయిలో ఆమె కోసం అంతర్జాలంలో వెతికారు. ఆమెను గురించిన విశేషాలు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపారు. అయితే అనూహ్యంగా ఆమె ట్విట్టర్ ఖాతాను నిలిపివేసుకున్నారు.
రెండు రోజుల క్రితం పెళ్లి సందర్బంగా గురుప్రీత్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మెహందీ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సీఎం భగవంత్ సింగ్ మాన్ మాన్, ఆయన తల్లి హర్పాల్ కౌర్‌తో దిగిన ఫొటోలను కూడా షేర్ చేయడం గమనార్హం.
అయితే, సీఎం భగవంత్ సింగ్ మాన్ సతీమణి కావడం, ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ రావడంతో ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే వారి సంఖ‍్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఒక్కసారిగా ఆమె ట్విట్టర్ ఖాతా కనిపించకుండా పోయింది. దీంతో నెటిజన్లు ఖంగుతిన్నారు. అయితే గురుప్రీత్ కౌర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలగలేదని తెలుస్తోంది. ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్లే ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయినట్టు సమాచారం.
మరోవైపు తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ కావడంపై గురుప్రీత్ కౌర్ కానీ, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పందించలేదు. అయితే గురుప్రీత్ కౌర్ కు గత నాలుగేళ్ల నుంచి ట్విట్టర్ ఖాతా ఉన్నా ఆమె ఎలాంటి పోస్టులు చేయలేదని తెలుస్తోంది. కొన్ని పోస్టులను మాత్రం రీట్వీట్ చేశారు.