పాఠాలు బంద్..టీచర్లకు ఇసుక మాఫియా డ్యూటీ

Update: 2020-06-21 01:30 GMT
ఏపీలో అయినా పంజాబ్ లో అయినా టీచర్లకు ఒకటే పరిస్థితి ఎదురైంది. మొన్న లాక్ డౌన్ లో మద్యం షాపులు తెరిచాక మందుబాబులను సెట్ రైట్ చేసే పనిని టీచర్లకు అప్పగించారు. పిల్లలకు పాఠాలు చెప్పి కంట్రోల్ చేసినట్టే మందుబాబులను కూడా కంట్రోల్ చేస్తారని ఆశించారు. కానీ టీచర్లకు ఆ డ్యూటీ వేయడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం టీచర్లను తెగ వాడేస్తోంది. ఇప్పటివరకు లిక్కర్ మాఫియాపై నిఘా పెట్టేందుకు టీచర్లను వాడుకున్న పంజాబ్ ప్రభుత్వం తాజాగా ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు 40మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను రంగంలోకి దింపింది.

పంజాబ్ లోని కపుర్తాలా జిల్లా ఫగ్వారాలోని చెక్ పోస్టుల వద్ద వారికి డ్యూటీలను వేసింది పంజాబ్ ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు టీచర్లు విధులు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్లతోపాటు పోలీసులు కూడా ఉంటారు. అక్రమ ఇసుక రవాణాను టీచర్లు అడ్డుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులకు పాఠాలు చెప్పి పైకి తీసుకురావాల్సిన ఉపాధ్యాయులను బోధనేతర కార్యకలాపాల్లో వినియోగించడంపై దుమారం రేపింది. తీవ్ర విమర్శలు చెలరేగాయి. పంజాబ్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నారు.
Tags:    

Similar News