అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడన్న మాట విన్నంతనే ఒళ్లు మండిపోయేంత కోపం వస్తుంది. అలా రావటంలో తప్పు లేదు. కానీ.. అయితే.. ఆ కోపం ఆ తర్వాతే ఏం జరిగిందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవటం ఖాయం. అందరికి ఇలా జరిగే ఛాన్స్ లేకున్నా కోట్లల్లో ఒక్కరికి ఇలాంటి లక్ దక్కటం మాత్రం మామూలు విషయం కాదు. ఇంతకీ జరిగిందేమంటే..
పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ ఒక కూలీ. అతగాడికి లాటరీ టికెట్ కొనాలన్న ఆశ ఉంది. కానీ.. చేతిలో డబ్బుల్లేవు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి అతగాడు రూ.200 అప్పు చేసి మరీ లాటరీ టికెట్ కొన్నాడు. రోజు తిరిగేసరికి అతగాడంత అదృష్టవంతుడు మరెవరూ లేరన్నట్లుగా సీన్ మారిపోయింది.
ఎందుకంటే.. అతగాడు కొన్న లాటరీకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.50 కోట్లు. అప్పు చేసిన కొన్న లాటరీ టికెట్ తో తన అదృష్టం మొత్తంగా మారిపోయిందని అతడు సంబరపడిపోతున్నాడు. లాటరీ టికెట్ కు ప్రైజ్ వచ్చిందన్న విషయాన్ని తాను మొదట నమ్మలేకపోయానని అతగాడు చెబుతున్నాడు.
అంతా కలలా ఉందని.. లాటరీ టికెట్ కొనటానికి తాను అప్పు చేశానని.. ఇంత డబ్బు సొంతమవుతుందని తాను అస్సలు అనుకోలేదన్నాడు. పంజాబ్ స్టేట్ లాటరీస్ అనే సంస్థ ఆగస్టు 29న పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్ 2018 పేరుతో ఒక లాటరీని నిర్వహించింది. రెండు టికెట్లకు మొదటి బహుమతిగా రూ.1.5కోట్ల చొప్పునప్రకటించింది. ఇందులో ఒకరు మనోజ్ కావటం గమనార్హం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు లాటరీ సొమ్ముతో వచ్చిన మొత్తంతో తన ఆర్థిక కష్టాలు తీరిపోయినట్లేనని మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.